ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు విశాఖ స్టీల్ పరిశ్రమ ప్రైవేటీకరణ రద్దు అంశం హాట్ టాపిక్ గా మారింది. దీన్ని విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం బిడ్ వేసిన నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రంగంలోకి దిగారు. ఈ విశాఖ ఉక్కును తెలంగాణ ప్రభుత్వం తరుఫున కొనేందుకు బిడ్ వేయాలని నిర్ణయించారు. వెంటనే సింగరేణి ప్రతినిధులను పంపి విశాఖ ఉక్కుపై ఎస్టిమేషన్ కు రెడీ అయ్యారు. దీంతో దెబ్బకు దిగివచ్చిన కేంద్రం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుందని బీఆర్ఎస్ అంటోంది..ఇది తమ విజయమని బీఆర్ఎస్ నేతలు చెబుతుంటే.. మీకు అంత సీన్ లేదని వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. వైసీపీ నేతలు కూడా దీనిపై పెదవి విరుస్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ వైసీపీ లొల్లి యమ రంజుగా సాగుతోంది. ఎవరెవరు నేతలు ఏమేం అన్నారో తెలుసుకుందాం.
ఓవైపు విశాఖ స్టీల్ పరిశ్రమ క్రెడిట్ కోసం వైసీపీ, బీఆర్ఎస్ ఇలా పొట్లాడుకుంటుంటే మధ్యలోకి తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ వచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న వైసీపీ , బీఆర్ఎస్ పార్టీలు ఒకే నాణేనికి ఉన్న బొమ్మ బొరుసులాంటివని బండి సంజయ్ ఆరోపించారు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఆ రెండు పార్టీలు సెంటిమెంట్ రగిలిస్తున్నాయన్నారు. ఒకరి స్వార్థం కోసం మరొకరు వ్యవహరిస్తున్నారని.. స్వార్థం కోసం విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్నారు.
విశాఖ ఉక్కు పరిశ్రమ కొనే దమ్ముంటే రాష్ట్రంలో బయ్యారం ఫ్యాక్టరీ, నిజాం షుగర్స్ తెరవొచ్చు కదా? అని తెలంగాణ ప్రభుత్వాన్ని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
నిజానికి విశాఖ ప్రైవేటీకరణ చేసేది కేంద్రం. ఇప్పుడు బీఆర్ఎస్ బిడ్ తో ముందుకు రావడంతో వెనక్కి తీసుకుంది. ఇక బయ్యారం పరిశ్రమను పెడుతానన్నది కూడా ఇదే బీజేపీ.. హ్యాండిచ్చింది. ఈ రెండు పరిశ్రమలపై ఇప్పుడు బీజేపీ, బీఆర్ఎస్ రాజకీయంతో విలన్ గా మారింది బీజేపీ. అందుకే బండి సంజయ్ బయటకు వచ్చి ఆ రెండు పార్టీలది నాటకం అంటున్నారు. కానీ ఇందులో ప్రధాన ముద్దాయి బీజేపీ అని మరిచిపోయారని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. బీజేపీ డ్యామేజ్ కాకుడదనే బండి ఇలా బయటకు వచ్చినట్టుగా అర్థమవుతోందని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.