తెలంగాణ కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయబడ్డ ఈటల రాజేందర్ ఇప్పుడు బీజేపీలో చేరబోతున్నారన్న వార్త వైరల్ గా మారింది. అయితే దీనిపై ఆయన డైరెక్టుగా సమాధానం చెప్పకుండా బీజేపీ పెద్దలతో భేటీలు జరుపుతూ కాక రేపుతున్నారు.
అయితే ఈటల బీజేపీలో చేరడం ఖాయమైందని.. త్వరలోనే అధికారికంగా కాషాయ కండువా కప్పుకోనున్నారని సమాచారం. ఒకప్పుడు కమ్యూనిస్టుగా రాజకీయం మొదలుపెట్టి ఉద్యమ పార్టీలో చేరి ఈటల ఇప్పుడు పూర్తి భిన్నమైన కాషాయ పార్టీలో కొనసాగుతారా? లేదా ? అన్నది డౌట్ గా మారింది.
కొద్దిరోజులుగా బీజేపీ రాష్ట్ర నాయకులతో టచ్ లో ఉన్న ఈటల తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతోనే ఫోన్ లో మాట్లాడినట్టు సమాచారం. బీజేపీ అగ్రనేత అమిత్ షా సైతం బీజేపీలోకి ఈటలను ఆహ్వానించినట్టు ప్రచారం సాగుతోంది.
ఇప్పటికే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లతో జరిపిన చర్చల్లో బీజేపీలో చేరేందుకు ఈటల ఓకే చెప్పినట్లు సమాచారం. గురువారం బీజేపీ చీఫ్ నడ్డాతోనూ ఈటల చర్చలు జరిపి ఓకే చెప్పినట్లు సమాచారం.
ఇక ఈటల చేరిక తేదీని ఒకటి రెండు రోజుల్లోనే బీజేపీ అగ్రనాయకత్వం ఖరారు చేయనుంది. ఆ తరువాత ఆయన ఢిల్లీలో బీజేపీ అగ్రనేతల సమక్షంలో బీజేపీలో చేరనున్నట్టు సమాచారం.