తెలంగాణ రాజకీయం ఊహించిన దానికంటే భిన్నంగా సాగుతోంది. అప్రతిహతమైన మెజారిటీతో మళ్లీ సీఎం సీటు నాదే అని కేసీఆర్ అంటూనే ఆ ఊపు తగ్గకుండా ఉండేందుకు తెలంగాణలో ప్రతి నియోజకవర్గాన్నీ కేసీఆర్ తిరుగుతున్నారు. కాంగ్రెస్‌లో మాత్రం ఎవరి నియోజకవర్గాలు వారు చక్కదిద్దుకునే పనిలో ఉన్నారు. స్టార్ క్యాంపెయినర్లు కాంగ్రెస్ కు పెద్దగా ఉపయోగపడటం లేదు.
ఎన్నికలు ఎపుడూ సర్ ప్రైజే. తెలంగాణలో ఈరోజుతో ప్రచారం ముగియనున్న నేపథ్యంలో నిన్న లగడపాటి వెల్లడించిన సర్వే వివరాలు ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. అయితే, ఇది ఒక పొలిటికల్ గేమ్ అని కేటీఆర్ కొట్టిపారేశారు. సంబంధిత సాక్ష్యాలను కూడా ప్రజల ముందు పెట్టారు. కేటీఆర్ వాట్సప్ లీక్స్‌తో లగటపాటి సర్వేల పై నీలినీడలు కమ్ముకున్నాయి. దీంతో ఖంగుతిన్న కాంగ్రెస్ కవర్ చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. దీంతో ఉదయం లగడపాటి పొంతన లేకుండా మాట్లాడుతూ సర్వే సంగతులు... ముందు వెనుక ఉన్న విశేషాలు వెల్లడించారు. అయితే, లగడపాటి వివరాల్లో ఉన్న గందరగోళాలు అనేక అనుమానాలను ప్రజల్లో లేవనెత్తాయి. ఇదిలా ఉండగా... జనాల్ని మరింత గందరగోళ పరచడమే లక్ష్యంగా కాంగ్రెస్ మరో గేమ్ మొదలుపెట్టింది. బండ్ల గణేష్ పేరు మీదున్న ఓ నకిలీ అక్కౌంట్ నుంచి ఇదిగో కేటీఆర్ తో చాటింగ్ అంటూ ఓ వాట్సప్ చాట్‌ను లీక్ చేశారు. అయితే, ఇది బండ్ల గణేష్‌దే అని పొద్దున నుంచి వైరల్ చేశారు.
అందులో ఏముందంటే...
బండ్ల గణేష్... ఎలా ఉంది కేటీఆర్ అని అడిగితే... "అంతా ఓకే. నేను ప్రజల్లో తిరుగుతూ అలసిపోయా" అని కేటీఆర్ రిప్లయి ఇచ్చారు". "నీ గురించే ఆలోచిస్తున్నాను సోదరా. నువ్వు కష్టపడుతున్నావ్" అని బండ్ల గణేష్ అనగా ట్టు ఉంది. "అవును... ఇవి రాజకీయాలు. పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. మా అవకాశాలు క్షీణిస్తున్నాయి. మా సర్వేలో మెరుపులు లేవు. నాన్న తీరు సరిగా లేదు. ఇది నాకు పిచ్చి పుట్టిస్తోంది. మేము గెలవకుంటే, నేను యూఎస్ వెళ్లిపోతానేమో. ప్రతిపక్షంలో మాత్రం కూర్చోలేను" అని కేటీఆర్ రిప్లయి ఇచ్చినట్టు అందులో ఉంది.దీనికి రిప్లయిగా బండ్ల స్పందిస్తూ, "అంతా మేలే జరుగుతుంది. మరికొన్ని రోజుల్లో అంతా అయిపోతుంది. వెయిట్ అండ్ సీ. తీరిక చూసుకుని నాకు ఫోన్ చెయ్యి" అనగా కేటీఆర్ "ఓకే" అన్నారు. ఇది ఇపుడు వైరల్ అవుతోంది. అయితే... ఎన్నికల్లో గ్రాఫిక్స్ గేమ్స్ ఆడటంపై జనాలుమండిపడుతున్నారు. అయినా ఈ మెసేజ్ ఫార్వర్డ్ చేసే ముందు ఒక సినిమా వ్యక్తి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి అయిన బండ్ల గణేష్‌తో కేటీఆర్ ఇలా మాట్లాడి ఉంటాడా? అనేది కూడా ఆలోచించకుండా ఈ ఫేక్ మెసేజ్‌ను ఫార్వర్డ్ చేసేస్తున్నారు.