లిక్కర్ కింగ్ విజయమాల్యా ఎపిసోడ్ లో మరో ఆసక్తికరమైన ఎపిసోడ్. వందలాది కోట్ల రూపాయలను రుణంగా తీసుకుని ఉద్దేశ పూర్వకంగా ఎగ్గొట్టిన కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా దేశం విడిచిపోకుండా ఆదేశాలు జారీ చేయాలని బ్యాంక్ లన్నీ మొరపెట్టుకుంటున్న సమయంలో తాజాగా షాకింగ్ న్యూస్ తెరమీదకు వచ్చింది. జాతీయ మీడియాలు వెలువరించిన కథనం ప్రకారం మాల్యా ఇప్పటికే దేశం విడిచి వెళ్లిపోయాడు!
మాల్యాల విదేశాలకు పారిపోతే తాము పెట్టిన కేసులన్నీ బలహీనమవుతాయని బ్యాంకులు ఆందోళన చెందుతూ ఆయన వెళ్లకుండా చూడాలని కోరడానికి ముందే కింగ్ ఫిషర్ అధినేత ఫ్లైట్ లో చెక్కేశాడని సమాచారం. మాల్యా ప్రతినిధి ఇచ్చిన వివరణ సైతం దీనికి బలం చేకూరుస్తోంది. తమకు కూడా మాల్యా ఈమెయిల్ల ద్వారానే కనెక్ట్ అవుతున్నందున ఆయన ఎక్కడ ఉన్నది ఇతమిత్తంగా చెప్పలేమని తేల్చేశారు.
మాల్యా దాదాపు 9వేల కోట్ల వరకు బాకీ ఉన్నట్లు ఎస్ బీఐ సహా వివిధ బ్యాంకులు తమ ఆవేదనను వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇంతేకాకుండా ఆయన ఆస్తుల జప్తుకు ఆదేశాలు ఇవ్వాలని కోర్టులను ఆశ్రయించాయి. విలాసపురుషుడిగా పేరొందిన మాల్యా రాజ్యసభ ఎంపీగా కూడా ఒక దఫా.