బీజింగ్ ను కాలుష్య భూతం వెంటాడి వేధిస్తోంది. మొన్నటికి మొన్న ఈ మహానగరంలో వాయు కాలుష్యం అపరిమితంగా పెరిగిపోవటంతో.. రెడ్ అలెర్ట్ ని ప్రకటించారు. బీజింగ్ ను కమ్మేసిన కాలుష్య తీవ్రత ఎంతంటే..ఇంట్లో నుంచి బజార్లోకి వస్తే.. అనారోగ్యం పాలయ్యేంత. దీంతో.. స్కూళ్లు.. ఆఫీసులు మూసేసి.. అత్యవసరం అయితే తప్పించి బయటకు రావొద్దని.. ఇంట్లో ఉండటం సేఫ్ అంటూ ప్రకటించటంతో పాటు.. వాహనాలు.. కర్మాగారాలు.. నిర్మాణాలు ఇలా చాలావాటి మీద పరిమితులు విధించి.. ఆంక్షలు పెట్టేశారు.
తాజాగా మరోసారి బీజింగ్ లో రెడ్ అలెర్ట్ ను ప్రకటించారు. కొద్ది రోజుల వ్యవధిలోనే రెండోసారి అలెర్ట్ ప్రకటించటంతో పాటు.. శనివారం నుంచి మంగళవారం వరకు దట్టమైన పొగమంచు ఏర్పడుతుందని.. ఈ నేపథ్యంలో బయటకు రావటం ఏ మాత్రం మంచిది కాదంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు.
తాజాగా కాలుష్య పరిస్థితి తీవ్రంగా ఉండటంతో.. మంగళవారం వరకూ వాహనాలు.. నిర్మాణాల విషయంలో ఆంక్షలు విధించారు. స్కూళ్లకు సెలవులు ఇచ్చేశారు. మొదటి రెడ్ అలెర్ట్ సమయంలో ఉన్న కాలుష్యంతో పోల్చుకుంటే.. ఈసారి దీని తీవ్రత మరింత ఎక్కువగా ఉందని అక్కడి వాతావరణ శాక పేర్కొంటోంది. మనిషి చేసిన తప్పునకు భవిష్యత్తు తరాలు కాదు.. వర్తమానంలోని వారే ఇక్కట్లు పడే పరిస్థితి. బీజింగ్ పరిస్థితిని చూసైనా మిగిలిన మహానగరాలు గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.