ఏపీ మున్సిపల్ ఎన్నికల వేళ బెట్టింగులు జోరందుకున్నాయి. మరో 48 గంటల్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడబోతుండడంతో ఎవరు గెలుస్తున్నారనే దానిపై జోరుగా పందేలు కాస్తున్నారు..ముఖ్యంగా విజయవాడ మేయర్ అభ్యర్థి ఎవరన్న దానిపై జోరుగా బెట్టింగులు సాగుతున్నట్టు ప్రచారం సాగుతోంది. కోట్ల రూపాయలు బెట్టింగులు కాస్తున్నారట.. ఫలితాలపై ఉత్కంఠ ఆపుకోలేకపోతున్న వైసీపీ, టీడీపీ కార్యకర్తలు మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందనే దానిపై డివిజన్లలో ఎవరికి ఎంతెంత మెజారిటీ వస్తుందనే దానిపై పందేలు కాస్తున్నారు.
విజయవాడ కార్పొరేషన్ అమరావతి పరిధిలో ఉండడం.. ఇక్కడ రాజధానిని విశాఖకు జగన్ తరలిస్తుండడంతో వైసీపీ గెలుస్తుందా? లేదా అనే దానిపైనే జోరుగా బెట్టింగులు సాగుతున్నాయి. విజయవాడ కార్పొరేషన్ లో 64 డివిజన్లకు గాను ఈనెల 14న ఫలితాలు వస్తాయి. కానీ పార్టీల కార్యకర్తలు, నాయకులు మాత్రం గెలుపు ఓటములపై బెట్టింగులు కడుతున్నారు.
10 లక్షలు కడితే 12 లక్షలు ఇస్తామంటూ నేతల ఓటములపై జోరుగా బెట్టింగులు కడుతున్నారు. కొన్ని డివిజన్లలో బెట్టింగ్ 20 లక్షల నుంచి 30 లక్షల వరకు వెళ్లిందని ప్రచారం సాగుతోంది.విజయవాడ టీడీపీ మేయర్ అభ్యర్థి కేశినేని శ్వేత 11వ డివిజన్ నుంచి పోటీచేస్తున్నారు. ఈమెపై భారీగా బెట్టింగ్ కాస్తున్నట్టు సమాచారం. ఇక వైసీపీ మేయర్ ఎవరు? ఆ అభ్యర్థిపై కూడా లక్షల్లో పందేలు కాస్తున్నట్టు ప్రచారం సాగుతోంది.
ఇక విజయవాడ మేయర్ పీఠం దక్కాలంటే ఏదైనా పార్టీకి దక్కాల్సిన మేజిక్ ఫిగర్ 33. దీనిపై కూడా బెట్టింగులు కాస్తున్నారు. 30 డివిజన్లు వచ్చినా తమకే మేయర్ పీఠం అని.. ఇక్కడ ఎక్స్ ఆఫీసియో సభ్యులు టీడీపీకి అధికంగా ఉన్నారని ఆ పార్టీ ధీమాతో ఉంది.