ఉద్యోగం రావాలంటే..భ‌గ‌వ‌ద్గీత చ‌ద‌వాల్సిందే

Update: 2018-04-16 15:48 GMT
ఔను. ఇదే కొత్త రూల్. ఉద్యోగం రావాలంటే..భ‌గ‌వ‌ద్గీత చ‌ద‌వాల్సిందే. ఎక్క‌డిదీ రూల్‌? ఎవ‌రు పెట్టారు అంటారా..రాజస్ధాన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఆర్‌పీఎస్‌సీ). ఈ ఏడాది నిర్వహించబోయే ఆర్‌ఏఎస్ (రాజస్థాన్ అడ్మినిస్ట్రేటర్ సర్వీస్) 2018 పరీక్ష కోసం సిలబస్‌ను రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మార్చింది. ఈ మార్పుల్లో భాగంగా జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ స్టడీస్ పేపర్‌లో కొత్తగా భగవద్గీతను కూడా  ఆర్పీఎస్‌సీ చేర్చింది. నీతి శాస్త్ర అన్న పేరుతో ఓ కొత్త యూనిట్‌ను పెట్టి అందులో భగవద్గీతను కూడా ఓ పార్ట్‌గా చేర్చింది.  అయితే భగవద్గీతతోపాటు మహాత్మాగాంధీ జీవిత చరిత్రకు సంబంధించిన ప్రశ్నలు కూడా పరీక్షలో అడగనున్నారు.

తాజా మార్పుల్లో భాగంగా జాతీయ స్థాయిలో ప్రముఖ నేతలు, సంఘ సంస్కర్తలు, ప్రముఖ పరిపాలనాధికారులకు సంబంధించిన ప్రశ్నలు కూడా ఉంటాయి. రోల్ ఆఫ్ భగవద్గీత ఇన్ మేనేజ్‌మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అనే పేరుతో కొత్తగా యూనిట్‌ను చేర్చారు. ఆర్‌ఏఎస్ 2018 కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు భగవద్గీతలోని 18 అధ్యాయాల నుంచి ప్రశ్నలు అడగనున్నారు. ఈ లెక్కన గీత మొత్తం క్షుణ్నంగా చదవాల్సిందే. బీజేపీ ప్రభుత్వం విద్యా రంగాన్ని కాషాయీకరిస్తోందని విపక్షాలు భగ్గుమంటున్న నేపథ్యంలో రాజస్థాన్‌ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.
Tags:    

Similar News