భూమా వైసీపీలోకి జంపా?

Update: 2020-06-14 14:30 GMT
ఓడలు బండ్లు..బండ్లు ఓడలు అవుతున్నాయి. వైసీపీ అధికారంలోకి రావడం.. ఆ పార్టీని వీడి టీడీపీలోకి చేరిన వారంతా  ఓడిపోవడంతో  నైరాశ్యంలో కూరుకుపోయారు. వరుసగా వచ్చిపడుతున్న కేసులకు తాళలేక మళ్లీ వైసీపీ వైపు చూస్తున్నారు. టీడీపీలో ఇమడలేకపోతున్నారు.

భూమా అఖిలప్రియ వైసీపీలో ఎమ్మెల్యేగా గెలిచి నాడు చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్ కు లోనై టీడీపీలో చేరి ఏకంగా మంత్రి అయ్యారు. వైసీపీకి మోసం చేశారు. ఇప్పుడు ప్రతిపక్షంలో కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఆమెతోపాటు 2017 ఉప ఎన్నికల్లో విజయం సాధించిన భూమా అఖిలప్రియ కజిన్ సోదరుడు - మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ఇప్పుడు అఖిలప్రియను వీడి తన దారి తాను చూసుకుంటున్నాడట..

నంద్యాల ఉప పోరులో నాడు అఖిలప్రియ తన కజిన్ బ్రదర్ అయిన అయిన బ్రహ్మానందరెడ్డిని నిలబెట్టి గెలిపించింది. వైసీపీ ఎంత ప్రయత్నించినా గెలవలేకపోయింది. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి నంద్యాలలో మరోసారి భూమా బ్రహ్మానందరెడ్డికి టికెట్ ఇవ్వడానికి చంద్రబాబు ససేమిరా అనడంతో ఆయన ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. అఖిలప్రియ పట్టుబట్టడంతో చివరకు టికెట్ ఇచ్చారు. అయితే వైసీపీ ధాటికి అందరూ ఓడిపోయారు. దీంతో ఎమ్మెల్యేగా భూమా బ్రహ్మానందారెడ్డి కేవలం రెండు సంవత్సరాలకే కొనసాగారు.

అయితే నంద్యాలలో తన ఓటమి వెనుక భూమా అఖిల ప్రియ మంత్రాంగం ఉందని బ్రహ్మానందరెడ్డి బావిస్తున్నాడట.. 2024 ఎన్నికల్లో తన సొంత సోదరుడు జగద్విఖ్యాత్ రెడ్డిని రంగంలోకి దింపాలని ఆమె భావిస్తున్నాడట.. ఈ క్రమంలోనే భూమా బ్రహ్మానందరెడ్డిని తప్పించే ప్రయత్నం చేస్తున్నారట.. ఇన్నాళ్లు ఓర్చుకున్న బ్రహ్మానందరెడ్డి టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.

ఇప్పటికే వైసీపీలో చేరికపై భూమా బ్రహ్మానందరెడ్డి జిల్లా ఇన్ చార్జి మంత్రి వైసీపీ నేతలతో ఫోన్ లో మాట్లాడినట్టు సమాచారం. అఖిలప్రియ తొక్కేస్తోందని.. అందుకే వైసీపీలో చేరాలని చూస్తున్నారట.. త్వరలోనే బ్రాహ్మానందరెడ్డి పార్టీ మారబోతున్నారని ప్రచారం సాగుతోంది.
Tags:    

Similar News