తెలుగు త‌మ్ముళ్ల‌కు క‌డ‌ప‌లో భారీ ఉక్కు షాక్

Update: 2018-06-15 10:36 GMT
నాలుగేళ్ల నుంచి ఏమీ చేయ‌కుండా.. ఇప్పుడెవ‌రో త‌రుముతున్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తూ ఉద్య‌మాలు చేస్తామంటూ.. ఓకే. .ఓకే అంటూ త‌ల ఊపేందుకు ప్ర‌జ‌లేమీ గొర్రెలు కాదుగా. నాలుగేళ్ల కాలం కామ్ గా ఉండి.. క‌డ‌ప జిల్లాలో ఉక్కు ప‌రిశ్ర‌మ‌పై కొద్ది రోజులుగా హ‌డావుడి చేస్తున్న టీడీపీ నేత‌ల‌కు తాజాగా ఘోర అవ‌మానం ఎదురైంది.

క‌డ‌ప జిల్లాలో ఉక్కు ప‌రిశ్ర‌మ‌ను ఏర్పాటు చేయాలంటూ కేంద్ర ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేస్తూ.. ఏపీ సీఎం చంద్ర‌బాబుకు స‌న్నిహితుడిగా వ్య‌వ‌హ‌రించే  సీఎం ర‌మేశ్.. మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డి త‌దిత‌రులు ఒక స‌మావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ స‌మావేశంతో క‌డ‌ప జిల్లాలో ఏర్పాటు చేయాల్సిన ఉక్కు ప‌రిశ్ర‌మ సాధ‌న‌కు నాయ‌క‌త్వం వ‌హించాల‌న్న‌ది అస‌లు ప్లాన్‌. ఇలా చేస్తే.. ఉద‌మ్యాన్ని త‌మ చేతుల్లోకి తీసుకొని ప్ర‌జ‌ల భావోద్వేగంతో 2019 ఎన్నిక‌ల్లో ల‌బ్థి పొందాల‌న్న‌ది టీడీపీ నేత‌ల వ్యూహం.

అయితే.. ఆదిలోనే దానికి భారీ షాక్ త‌గిలింది. టీడీపీ నేత‌లు ఏర్పాటు చేసిన స‌మావేశానికి ఒక‌రిద్ద‌రు ప్ర‌జా సంఘాల‌కు చెందిన నేత‌లు త‌ప్పించి మిగిలిన వారు హాజ‌రు కాలేదు. విద్యార్థి సంఘాలు మొద‌లు ప‌లు సంఘాలు ఉక్కు ప‌రిశ్ర‌మ‌కు కోసం పోరాడుతున్నాయి. అయితే.. ఇంత కాలం నుంచి మాట మాట్లాడ‌ని తెలుగు త‌మ్ముళ్లు.. బీజేపీతో క‌టీఫ్ చెప్పిన నాటి నుంచి కేంద్రం మీద ఒత్తిడి పెంచేందుకు వీలుగా ఉక్కు ప‌రిశ్ర‌మ ఏర్పాటుపైఉద్య‌మిస్తున్నారు. పూర్తిగా రాజ‌కీయ కోణ‌మే త‌ప్పించి.. ప్ర‌జ‌ల గురించి ప‌ట్ట‌ని టీడీపీ నేత‌ల‌కు దిమ్మ తిరిగేలా షాకిచ్చార‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది.
Tags:    

Similar News