గత కొన్ని రోజులుగా వివాదంగా ఉన్న ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్, సీనియర్ కాంగ్రెస్ నే త ఏలేటి మహేశ్వరరెడ్డి పార్టీకి బిగ్ షాక్ ఇచ్చారు. ఆయన నేరుగా పోయి.. బీజేపీ కండువా కప్పుకొన్నారు.
బీజేపీ తెలంగాణ వ్యవహార ఇంచార్జ్ తరుణ్ చుగ్ నేతృత్వంలో మహేశ్వరరెడ్డి.. కమలం పార్టీలో చేరడం.. పూర్తయిపోయింది. అయితే.. మరోవైపు.. ఏలేటి మహేశ్వర్‌రెడ్డికి టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఈ నోటీసులకు సమాధానం చెప్పాలంటూ. .కొన్ని గంటలు మాత్రమే సమయం ఇచ్చారు. ఇంతోనే ఏలేటి పార్టీ మారడం గమనార్హం. గత కొన్నాళ్లుగా ఏలేటి.. బీజేపీతో సన్నిహితంగా వ్యవహరిస్తూ టీపీసీసీ నాయక త్వంపై విమర్శలు చేస్తున్నారనే విషయం తెలిసిందే.
ఈ క్రమంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్ప డుతున్నారని మహేశ్వర్‌రెడ్డిపై కాంగ్రెస్ తెలంగాణ నాయకత్వానికి ఫిర్యాదు అందింది.
ఈ క్రమంలోనే మహేశ్వరరెడ్డికి షోకాజ్ నోటీసును జారీ చేశారు. మరోవైపు.. బుధవారం ఉదయం నుంచి మహేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడనున్నట్లుగా సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున వ్యూహాత్మక ప్రచారం జరిగింది. కానీ, మిగిలిన నేతలతో సామానంగా.. తాను పార్టీ మారుతున్నట్లుగా వదంతులు వస్తున్నాయని, ఇలా జరగడం బాధాకరమన్నారు.
ఇప్పటికీ రేవంత్ అంటే తనకు అభిమానం ఉందని బుధవారం వరకు చెప్పారు. కానీ, అనూహ్యంగా గురువారం ఉదయం ఏలేటి.. పార్టీ మారిపోయారు. తరుణ్ చుగ్ సమక్షంలో ఆయన బీజేపీ కండువా మార్చుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.