మిత్రపక్ష పార్టీలైన భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీల మధ్య నెలకొన్న "స్నేహపూర్వక దూరం: మరింత ముదిరిపోయింది. ఏకంగా ఎవరిది వారు బరిలోకి దిగేందుకు తొలి అడుగు పడింది. ఈ క్రమంలో తాజాగా వెలువడిన పురపాలక ఎన్నికల్లో బీజేపీ తన అభ్యర్థులను ప్రకటించడమే కాకుండా ఏకంగా తన జాబితాను కూడా వెల్లడించింది.
ఖమ్మం కార్పొరేషన్ తో సహా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీడీపీ-బీజేపీలు కలిసి బరిలోకి దిగడంపై పలు సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల బీజేపీ ఇన్ చార్జి రాంచంద్రారెడ్డి స్పష్టమైన ప్రకటన చేస్తూ ఈ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని తెలిపారు. హన్మకొండలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అనంతరం పార్టీ తరఫున 26 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఇప్పటికే మిత్రపక్షాల మధ్య తెలంగాణలో చీలిక నెలకొందనే వార్తల నేపథ్యంలో తాజా ప్రకటన దాన్ని నిజం చేసేలా ఉందని రాజకీయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.