కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కొత్త రికార్డు తన సొంతం చేసుకుంది. అడ్వర్టైజ్ మెంట్లు జారీ చేయడంలో దేశ వ్యాప్తంగా నంబర్ వన్ బ్రాండ్ గా నిలిచింది. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో వ్యాపారం చేసే బహుళ జాతి కంపెనీలను సైతం వెనక్కి నెట్టి - బీజేపీ మొదటి స్థానంలో నిలిచింది. ఫిబ్రవరి 18 నుండి 24వ తేదీ వరకు దేశ వ్యాప్తంగా జారీ అయిన ప్రకటనలపై బార్క్ ( బ్రాడ్ కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ఇండియా) విడుదల చేసిన వారంతపు నివేదికలో ఈ విషయాన్ని పేర్కొంది. అంతకు ముందు రెండు వారాల్లోనూ బీజేపీ మొదటి స్థానంలోనే కొనసాగుతుండటం విశేషం.
తాజాగా విడుదలైన నివేదిక ప్రకారం వారం రోజుల్లో 13,973 సార్లు దేశ వ్యాప్తంగా ఎలక్ట్రానిక్ మీడియాలో బీజేపీ ప్రకటనలు గుప్పించింది. టెలీ కమ్యూనికేషన్ రంగంలో సంచలనం సృష్టిస్తున్న జియో ఫై 11,602 ప్రకటనలతో రెండో స్థానంలో నిలిచింది. ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంకు - క్లోజప్ - కాల్గేట్ వంటి దిగ్గజ బహుళ జాతి సంస్థలు ఆ తరువాతి స్థానాల్లో నిలిచాయి. ఉత్తరప్రదేశ్ - పంజాబ్ తో పాటు మరికొన్ని రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో భారతీయ జనతాపార్టీ భారీ ఎత్తున ప్రకటనలు జారీ చేసింది. మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ ఎన్నికల్లోనే పోటీ చేస్తున్న ఇతర రాజకీయ పార్టీలు వేటికీ బార్క్ రేటింగ్స్‌లో కనీసం స్థానం కూడా లభించలేదు. అంటే, ఆ పార్టీలతో పోల్చుకుంటే ఎన్ని రెట్లు ఎక్కువగా భారతీయ జనతా పార్టీ ప్రకటనలు జారీ చేసిందో అర్థం చేసుకోవచ్చు. అయితే, ఇంత పెద్ద ఎత్తున ప్రకటనలు జారీ చేయడానికి ఆ పార్టీ పెట్టిన ఖర్చు ఎంత? ఎన్నికల కమిషన్ నిబంధనల పరిధిలోనే ఈ ఖర్చు ఉందా? అనే విషయాలపై స్పష్టత లేదు. పెద్దనోట్ల రద్దు అనంతర పరిస్థితుల్లో ప్రకటనలకు ఖర్చు చేసిన మొత్తాన్ని బిజెపి ఏ విధంగా చెల్లించిందన్న విషయంలోనూ వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రచారంలో మొదటి పదిస్థానాలు వీటికే
ర్యాంకు బ్రాండ్ ప్రకటనల సంఖ్య
1 భారతీయ జనతా పార్టీ 13,973
2 జియో ఫై 11,602
3 ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంకు 9.848
4 క్లోజ్ ఆప్ ఎవ్వర్ ఫ్రెష్ 9,166
5 డొమినాస్ మొబైల్ ఆప్ 8,968
6 కాల్గేట్ డెంటల్ క్రీమ్ 8,327
7 లలితా జ్యూవెలరీ 7,747
8 వివో వి5 ప్లస్ 7,336
9 డెట్టాల్ లిక్విడ్ సోప్ 7,102
10 సర్ఫ్ ఎక్సెల్ ఈజీ వాష్ 7,096
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/