గత లోక్ సభ ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ కొద్దో గొప్పో పరువు నిలుపుకుంది. అప్పుడు కాంగ్రెస్ కు దక్కిన అత్యంత పరిమిత సీట్లలో కర్ణాటక వాటా ప్రముఖమైనది. అప్పట్లో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ సోలోగా అధికారాన్ని అనుభవించింది. దీంతో లోక్ సభ ఎన్నికల్లో సీట్లు కూడా బాగానే వచ్చాయి.
ఇక గత ఏడాదిలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చిత్తు అయ్యింది. అయితే అంతమింగా జేడీఎస్ తో కలిసి ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేసింది. ఇక లోక్ సభ ఎన్నికలకు కూడా కాంగ్రెస్- జేడీఎస్ లు అదే పొత్తును కొనసాగిస్తూ ఉన్నాయి.
కాంగ్రెస్- జేడీఎస్ ల ఓటు బ్యాంకు కలిపితే.. ఇరవై ఎనిమిది ఎంపీ సీట్లున్న కర్ణాటకలో కనీసం పదిహేడు ఎంపీ సీట్లను ఆ కూటమి సొంతం చేసుకోవాలని విశ్లేషకులు అంటున్నారు. అయితే అది జరిగే పనిలా మాత్రం కనిపించడం లేదు. పేరుకు అయితే పొత్తే కానీ..కాంగ్రెస్ – జేడీఎస్ కార్యకర్తలు క్షేత్ర స్థాయిలో సహకరించుకునే అవకాశాలు మాత్రం లేవు.
కాంగ్రెస్ బలంగా ఉన్న కొన్ని సీట్లు జేడీఎస్ కు కేటాయించారు. అలాంటి చోట్ల ఆ పార్టీ తరఫు నుంచి తిరుగుబాటు దార్లు రంగంలో ఉన్నారు. జేడీఎస్- కాంగ్రెస్ లు దశబ్దాలుగా రాజకీయ వైరంతో మెలిగాయి. ఏదో హంగ్ తరహా పరిస్థితి రావడంతో అధికారం కోసం చేతులు కలిపాయి. అయితే క్షేత్ర స్థాయిలో మాత్రం కార్యకర్తలు చేతులు కలపడం లేదు!
ఫలితంగా వీరి పొత్తు పెద్దగా ప్రయోజనాలను కలిగించేలా లేదు ఇరు పార్టీలకూ. పైగా.. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్- జేడీఎస్ లు చేతులు కలిపాయనేది సామాన్యుల్లో ఆలోచనను కలిగిస్తూ ఉంది. ఆగర్భ శత్రువుల్లాంటి పార్టీలు బీజేపీని ఎదుర్కొనడానికి చేతులు కలిపి అవకాశవాదాన్ని చాటుతూ ఉన్నాయనే లెక్కతో ఉన్నారు జనాలు. మరి ఆ లెక్కలు బీజేపీ మీద సానుభూతిని కలిగించాయంటే.. మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది.
కాంగ్రెస్-జేడీఎస్ లు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన బలాబలాలను బట్టి అవి మెజారిటీ ఎంపీ సీట్లను నెగ్గాలి కానీ, ఎన్నికల అనంతరం అవి చేతులు కలిపిన తీరుపై జనాలు విసుగు చెందితే మాత్రం.. మెజారిటీ సీట్లు బీజేపీవే. అయితే బీజేపీకీ అక్కడ కొన్ని మైనస్ పాయింట్లున్నాయి. యడ్యూరప్ప ఆడియో టేపులు బీజేపీకి నష్టం చేకూరుస్తున్నాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.