తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆసక్తికరమైన హామీలు ఇస్తున్న సంగతి తెలిసిందే. మ్యానిఫెస్టోపై సుదీర్ఘ కసరత్తు చేస్తున్న బీజేపీ ఈ క్రమంలో మధ్య తరగతిని టార్గెట్ చేస్తూ ప్రకటనలు చేస్తోంది. బీజేపీ అధికారంలోకి వస్తే పండుగలు, ఉత్సవాల సందర్భంగా ఏటా లక్ష గోవులు పంపిణీ చేస్తామని ఆ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఎన్ వీఎస్ ఎస్ ప్రభాకర్ ప్రకటించారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని - తెలంగాణ ఆవిర్భావం వరకు జరిగిన సంఘటనలను కళాశాల స్థాయిలో పాఠ్యాంశంగా చేరుస్తామన్నారు. కానీ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోపై, ఆవుల పంపకంపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. తనకూ ఓ ఆవును ఇస్తారా అంటూ ప్రశ్నించారు.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఒక లక్ష ఆవులను పంపిణీ చేస్తామని ఆ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడంపై హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమం లో ఓవైసీ స్పందిస్తూ `నాకు కూడా ఆవులు ఇస్తారా?` అని బీజేపీ నేతలను ఓవైసీ ప్రశ్నించారు. ఒక వేళ నాకు ఆవులను ఇస్తే గౌరవంగా చూసుకుంటానని ఓవైసీ హామీనిచ్చారు. అసలు నాకు ఆవులను ఇస్తారా? అన్నది తన ప్రశ్న అని పేర్కొన్న ఓవైసీ.. నవ్వులాట కాదిది.. దీని గురించి ఒకసారి ఆలోచించాలని ఆయన సూచించారు.