కేంద్రంలో వరుసగా రెండో సారి క్లిస్టర్ క్లియర్ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పార్టీగా బీజేపీకి ఓ గొప్ప రికార్డు ఉన్నట్టే లెక్క. అయితే ఆ గొప్ప రికార్డు దక్కించుకున్న పార్టీకి ఉండాల్సిన హూందాతనం మాత్రి బీజేపీకి లేదన్న విమర్శలు ఇప్పుడు కాస్తంత గట్టిగానే వినిపిస్తున్నాయి. దేశ ప్రజలకు ప్రతినిధులం తామేనంటూ గొప్పగా చెప్పుకునే కమలనాథులు... ఆ జనం గొంతుకల నుంచి వచ్చే సూచనలు, సలహాలు, విమర్శలను మాత్రం సహించలేకపోతున్నారన్న విషయం ఇప్పుడు బట్టబయలైపోయిందన్న వాదనలు నిజంగానే ఆ పార్టీకి కాస్తంత ఇబ్బంది కలిగించేవేనని చెప్పక తప్పదు.
ఇలా బీజేపీ నైజం ఇదేనన్న వాదనకు ఆస్కారమిచ్చిన ఘటన వివరాల్లోకి వెళితే... ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా మహిళగా ఉండి ప్రపంచ వ్యాపార దిగ్గజం పెప్సీకోకు చైర్ పర్సన్ గా ఏళ్ల తరబడి పనిచేసిన కిరణ్ మజుందార్ గుర్తున్నారు కదా. ప్రస్తుతం దేశంలో నెలకొన్న ఆర్థిక మందగమనం... మజుందార్ ను ఒకింత కలవరానికి గురి చేసిందట. ఈ క్రమంలో తమలాంటి కార్పొరేట్ల సలహాలు తీసుకుని ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దవచ్చు గదా అన్న రీతిలో ఆమె ఓ యత్నం చేస్తే... అది బీజేపీ నేతల చెవికెక్కలేదు. ఈ క్రమంలో ఆమె తన నిరసనను వ్యక్తం చేస్తూ...‘ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టే క్రమంలో ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీల సూచనలు కూడా పరిగణనలోకి తీసుకుటుందని ఆశిస్తున్నాం. ఇప్పటి వరకూ ప్రభుత్వం మమ్మల్ని పరాయివాళ్లలా చూసింది. మేం విమర్శిస్తే వినేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు’ అని ఆమె ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్ కమలనాథులను బాగానే హర్ట్ చేసినట్టుంది. వెనువెంటనే రంగంలోకి దిగిపోయిన బీజేపీ నేతలు మజుందార్ పై తమదైన శైలి ఎదురు దాడి మొదలెట్టేశారు. బీజేపీ ప్రభుత్వానికి ఆధిపత్య ధోరణి లేదని, తమ హయాంలో కార్పొరేట్లను ప్రత్యేకంగా చూడకపోవడంతో ఇటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయని బీజేపీ నేత అమిత్ మాల్వియా అన్నారు. మజుందార్ ట్వీట్ నేపథ్యంగానే మాల్వియా ఈ వ్యాఖ్యలు చేశారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా. అంటే... విమర్శలను బీజేపీ సహించలేకపోతున్నట్టే కదా.