ఇటీవల కాలంలో ప్రముఖులకు చేతివాటం చూపే దొంగలతో షాకుల మీద షాకులు తగులుతున్నాయి. తాజాగా అలాంటి చేదు అనుభవం ఎదురైంది ప్రముఖ గాయకుడు కమ్ బీజేపీ ఎంపీ హన్స్ రాజ్ కు. తాజాగా ఆయన ఎంతో ఉత్సాహంతో పాల్గొన్న ఊరేగింపు ఊహించని షాక్ ఇచ్చింది.
ఢిల్లీలోని హాజ్ కాజీలాల్ కౌన్ ప్రాంతంలో దుర్గా మందిరంలో దుర్గామాత విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు సదరు బీజేపీ ఎంపీ అంగరంగ వైభవంగా నిర్వహించారు. విగ్రహాన్ని ప్రతిష్ఠించే విషయంలో ఒక ప్రత్యేకత ఉంది. ఇటీవల ఈ ఆలయంలోని దుర్గామాత విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. దీనిపై పెద్ద రగడే చోటు చేసుకుంది.
దుర్గామాత విగ్రహాన్ని ధ్వంసం చేసిన నేపథ్యంలో.. కొత్త విగ్రహాన్ని ప్రతిష్ఠించే కార్యక్రమాన్ని భారీఎత్తున నిర్వహించాలని బీజేపీ నాయకత్వం డిసైడ్ అయ్యింది.
ఇందులో భాగంగా నిర్వహించిన భారీ ఊరేగింపులో ఎంపీ హన్స్ రాజ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ కూడా హజరయ్యారు. ఊరేగింపు ఉత్సాహంలో ఉన్న ఎంపీగారికి అర్థం కాని రీతిలో ఆయన జేబులోని ఫోన్ కొట్టేశారు.
ఊరేగింపు కార్యక్రమం ముగిసిన తర్వాత కానీ ఆయన తన ఫోన్ మిస్ అయిన విషయాన్ని గుర్తించలేదు. ఆయన ఫోన్ ఎక్స్ ఎస్ మ్యాక్స్ ఐ ఫోన్ గా చెబుతున్నారు. తన ఫోన్ పోయిన విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయటంతో.. సెక్షన్ 379 కింద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఊరేగింపులో తమ వాళ్లే అందరూ ఉన్న వేళ.. ఇలా ఫోన్ పోవటంపై బీజేపీ నేతలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకూ మిగిలిన పార్టీలు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనే నేతల ఫోన్లు.. పర్సులు పోయాయని.. తమ పార్టీకి చెందిన వారి ఊరేగింపులో ఫోన్ పోవటమా? అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.