తెలంగాణా బీజేపీలో ఆపరేషన్ పరిపూర్ణానంద జరుగుతుందా అన్న సందేహానికి.. పార్టీ క్యాడర్ నుంచి ఔననే సమాధానం వస్తుంది. నిన్న కాక మొన్న వచ్చి మా నెత్తిపై కూర్చుంటావా అంటూ రాష్ట్ర నేతలే మండిపడుతున్నారట. ఆయనను చెక్ పట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ బీజేపీలో ఈ పరిణామం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
చిక్కి శల్యమైపోతున్న పార్టీకి ఆక్సిజన్ ఇద్దామనుకున్న స్వామి పరిపూర్ణానందకు చుక్కెదురవుతోంది. ఇటీవల జాతీయ నేతల ఆశీస్సులు తీసుకుని వచ్చారాయన. పార్టీ అభ్యర్థులను డిసైడ్ చేసే స్థాయిలో ఉన్నట్లు ప్రచారం కూడా జరిగింది. ఆయన ఎవరికి చెబితే వారికే టిక్కెట్ కన్ ఫాం అంటూ నేతలు కూడా వ్యాఖ్యానించారు.
సీఎం అభ్యర్థిగా పరిపూర్ణానందను ప్రకటించేందుకు జాతీయ నేతలు సిద్ధమవుతున్నారట. మరి ఇప్పటి వరకు తెలంగాణాలో పనిచేసుకంటూ వస్తున్న నేతలు ఆయనకు శత్రువులుగా మారిపోయారు. స్వామికి చెక్ పెట్టకపోతే మేకులా మారే పరిస్థితి ఉంటుందని భావిస్తున్నారట. ఆ మేరకు రంగంలోకి దిగారు బీజేపీ తెలంగాణ ఇన్చార్జి లక్ష్మణ్.
పరిపూర్ణానంద జూబ్లిహల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకుంటున్నారట. అయితే, ఆయన పోటీ చేయాలనుకుంటున్న జూబ్లిహల్స్ నియోజకవర్గం నుంచి పార్టీ అధికార ప్రతినిధి శ్రీధర్ రెడ్డిని రంగంలోకి దింపుతున్నట్లు లక్ష్మణ్ ప్రకటించేశారు. ఈయన ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారని కాబట్టి టిక్కెట్ ఇవ్వాలని ఇటీవల జరిగిన పార్లమెంటరీ సమావేశంలో పార్టీ అధిష్టానం దగ్గర ప్రపోజల్ పెట్టారంట లక్ష్మణ్.
కాగా, పరిపూర్ణానంద బీజేపీలో చేరే వేళ ఆయన వెంట ఏ ఒక్క తెలంగాణ నేత లేరు. కనీసం ఎవరికీ సమాచారం కూడా లేదంట. తాజా మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్ పార్టీలో చేరేటప్పుడు లక్ష్మణ్ పక్కనే ఉన్నారు. మరి, పరిపూర్ణానంద విషయంలో అధిష్ఠానం తమను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదని కినుక వహించారట కమలదళపతి.
ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న టీఆర్ ఎస్ - మహా కూటమికి పోటీనిస్తూనే - సొంత పార్టీలో జరుగుతున్న అంతర్గత వ్యవహారాలను చక్కదిద్దే పనిలో పడ్డారట తెలంగాణ బీజేపీ నేతలు. ఇంట గెలిచి రచ్చ గెలవాలని తెలిసొచ్చినట్లుంది పరిపూర్ణానందకు కూడా. మరి పార్టీ నేతలను ఆయన దారిలోకి తెచ్చుకుంటారా లేక ఆయనే వారి దారిలోకి వెళ్తారా అన్నది ప్రశ్నగా మారింది. ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలో కూడా తెలియక అంతర్మథనం పడుతున్నట్లు తెలుస్తుంది.