హెలిక్యాప్టర్ ప్రమాదంలో భారత త్రివిధ దళాదిపతి బిపిన్ రావత్ మరణించడం విషాదం నింపింది.ఈ క్రమంలోనే అసలు ప్రమాదం ఎలా జరిగింది.? ఎలా బిపిన్ రావత్ చనిపోయాడు? ప్రమాదానికి కారణాలేంటన్న ప్రశ్న ఇప్పుడు అందరినీ తొలుస్తోంది.
ఈక్రమంలోనే ప్రమాదానికి కీలకమైన బ్లాక్ బాక్స్ ను కొద్దిసేపటి క్రితమే ఘటనా స్థలంలో సేకరించింది ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక టీం. హెలిక్యాప్టర్ కూలిన ప్రంతానికి 30 అడుగుల దూరంలో బ్లాక్ బాక్స్ ను అధికారులు గుర్తించారు.
ప్రమాదానికి కొన్ని క్షణాల ముందు దట్టమైన అడవి ప్రాంతంలో ఏం జరిగింది? ఆర్మీ హెలిక్యాప్టర్ క్రాష్ ల్యాండింగ్ కు అసలు కారణాలేంటి? దట్టమైన పొగమంచు కారణమా? అన్న అంశంపై దర్యాప్తు కొనసాగుతోంది.
డీకోడింగ్ కోసం బ్లాక్ బాక్స్ ను ఢిల్లీ లేదా బెంగళూరుకు తరలించే అవకాశం ఉంది. ప్రమాద స్థలంలో బ్లాక్ బాక్స్ తోపాటు మరో 3 ఇతర వస్తువులను సేకరించారు.
బ్లాక్ బాక్స్ లో ఏముంది? ప్రమాదానికి ముందు అసలు ఏం జరిగింది? పైలట్ బిపిన్ రావత్ తో ఏం మాట్లాడారు..? ప్రమాదం జరిగిన సమయంలో ఏటీసీతో కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేశారా? అన్నది బ్లాక్ బాక్స్ ద్వారా పూర్తి సమాచారాన్ని సేకరించనున్నారు. బ్లాక్ బాక్స్ ను డీకోడింగ్ చేస్తే ప్రమాదానికి అసలు కారణమేంటన్న అంశంపై క్లారిటీ రానుంది.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ మార్షల్ వీఆర్ చౌదరి కూనూర్ లో తాజాగా ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఫోరెన్సిక్ నిపుణులు కూడా ఆ ప్రాంతంలో ఆధారాలను సేకరించారు.