షాక్.. దేశాధ్యక్షుడిగా ఎన్నికైతే.. అంత పెద్ద కంపెనీని అమ్మేస్తాడట

Update: 2020-02-19 06:30 GMT
షాకింగ్ నిర్ణయాన్ని వెల్లడించారు అమెరికా అధ్యక్ష్య ఎన్నికల బరిలోకి దిగాలనుకుంటున్న ప్రముఖ పారిశ్రామికవేత్త.. మైకల్ బ్లూమ్ బర్గ్. త్వరలో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ తరఫున నామినేషన్ దాఖలు చేసేందుకు ఆయన ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ తో తలపడేందుకు సిద్ధపడుతున్న ఆయన.. తనను బిలియనీర్ నుచేసిన బ్లూమ్ బర్గ్ కంపెనీని అమ్మేస్తానని చెప్పి సంచలనంగా మారారు.

ఈ నవంబరులో అమెరికా అధ్యక్ష ఎన్నికలుజరగనున్నాయి. ఇందులో భాగంగా అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగేందుకు మైకేల్ ఊవ్విళ్లూరుతున్నారు. దీనికి సంబంధించిన కసరత్తును ఇప్పటికే పూర్తి చేశారు. డెమొక్రాటిక్ నామినేషన్ కు ఓపీనియన్ పోల్స్ లో అనూహ్యం గా మైకేల్ ముందుకు వచ్చారు.

తాజాగా జరిగిన తన తొలి ఎన్నిక ప్రచార చర్చలో పాల్గొననున్న ఆయన.. ఈ సమావేశానికి ముందు ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది ఏడాదికి రూ.70వేల కోట్ల ఆదాయాన్ని ఇచ్చే బ్లూమ్ బర్గ్ కంపెనీని తాను అమ్మేస్తానని.. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన వెంటనే సంస్థను అమ్మకానికి పెడతానని మైకేల్ తరఫు ప్రతినిధులు పేర్కొంటున్నారు.

1981లో బ్లూమ్ బర్గ్ ను స్టార్ట్ చేశారు. అంచలంచెలుగా ఎదిగిన ఈ సంస్థ వాణిజ్య సమాచారం తో పాటు.. వార్తల్ని అందించటంలోనూ ముందు ఉంటుంది. బ్లూమ్ బర్గ్ ప్రజాదరణ అత్యధికం గా ఉన్న సంస్థగా పేరుంది. ఎంత దేశ అధ్యక్షుడైతే మాత్రం.. తాను పెంచి పెద్దచేసిన సంస్థను అమ్మటమా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
Tags:    

Similar News