ఏమైందో ఏమో కానీ.. పద్నాలుగేళ్ల పిల్లోడికి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మీద విపరీతమైన ఆగ్రహం వచ్చింది. కారణం బయటకు రాలేదు కానీ..ఆ కుర్రాడు.. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అధికార నివాసాన్ని పేల్చేస్తానంటూ పోలీసులకు ఫోన్ చేసిన వైనం సంచలనం సృష్టించింది. ఒక ఆగంతుకుడి నుంచి పోలీసులకు అందిన పోన్ కాల్లో.. తాను సీఎం జయలలిత ఇంటిని పేల్చేయనున్నట్లు చెప్పాడు.
ఈ మాటలతో ఒక్కసారి అలెర్ట్ అయిన పోలీసులు.. వెంటనే కాల్ ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయాన్ని దర్యాప్తు చేసి.. సదరు ఫోన్ కాల్ విల్లుపురం జిల్లా మరకణ్ణం ప్రాంతం నుంచి వచ్చినట్లుగా గుర్తించారు. హుటాహుటిన వెళ్లిన పోలీసుల బలగాలకు పెద్ద షాకే తగిలింది. సీఎం ఇంటిని పేల్చేస్తానని చెప్పి బెదిరించింది 14ఏళ్ల కుర్రాడన్న విషయాన్ని గుర్తించిన పోలీసులు గతుక్కుమన్నారు.
ఆ కుర్రాడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అలా ఎందుకు ఫోన్ చేశాడన్న విషయం మీద విచారణ షురూ చేశాడు. పిల్లోడి ఫోన్ కాలే కదా అని లైట్ తీసుకోకుండా.. ఎందుకైనా మంచిదన్న ముందుజాగ్రత్తతో అమ్మ నివాసమైన పోయిస్ గార్డెన్ లో భారీగా భద్రతా ఏర్పాట్లు చేయటం గమనార్హం. పోరడి ఫోన్ కాల్ తమిళనాడు పోలీసుల్ని ఉరుకులు పరుగులు పెట్టించిందనే చెప్పాలి.