మహమ్మారి వైరస్ ప్రభావంతో విధించిన లాక్‌డౌన్ వలన దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ప్రస్తుతం ఐదో దశ లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం చేసిన ప్రకటనతో ఆర్థిక వ్యవస్థ కొంత భరోసా లభించింది. దాని పరిణామం మార్కెట్‌లో కనిపించింది. ఈ సమయంలో దేశీయ కరెన్సీ రూపాయి లాభపడింది. అమెరికా డాలర్ మారకంతో పోలిస్తే బలపడింది. డాలర్ మారకంతో మంగళవారం రూపాయి 75.57 వద్ద ప్రారంభమై ఆ తర్వాత పుంజుకుంది. చివరకు 18 పైసలు లాభపడి 75.36 వద్ద ముగిసింది.
అంతకుముందు సెషన్‌లో రూపాయి 75.54 వద్ద స్థిరపడింది. ఇతర కరెన్సీలతో పోలిస్తే తగ్గిన డాలర్ ఇండెక్స్ ముడి చమురు బ్రెంట్ ఫ్యూచర్స్ 2.14 శాతం పెరిగి బ్యారెల్‌కు 39.14 డాలర్లకు చేరుకుంది. ఇతర కరెన్సీలతో పోలిస్తే డాలర్ ఇండెక్స్ 0.27 శాతం తగ్గి 97.57 వద్దకు చేరుకుంది. రూపాయి విలువ పెరగడానికి కారణం.. సానుకూల దేశీయ ఈక్విటీలు, బలహీనమైన అమెరికన్ డాలర్, విదేశీ నిధుల ప్రవాహం.. పెట్టుబడిదారుల సెంటిమెంట్‍కు పాజిటివ్‌గా ఉందని నిపుణులు చెబుతున్నారు. మార్కెట్లు వరుసగా ఐదో సెషన్లో లాభపడ్డాయి.
ప్రధానమంత్రి చేసిన ప్రకటన తర్వాత మరింత పుంజుకున్నాయి. మంగళవారం సెన్సెక్స్ 522 పాయింట్లు, నిఫ్టీ 153 పాయింట్ల లాభంతో ముగియడం విశేషం. చమురు ధరలు ఇలాగే ఉంటే రూపాయి మారకపు విలువలో స్థిరత్వం కొనసాగే అవకాశం ఉందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ రజనీశ్ కుమార్ తెలిపారు. ద్రవ్యలోటు కూడా అదుపులోనే ఉంటుందని భావిస్తున్నారు. చమురు ధరలు ఇదే మాదిరి ఉంటే రూపాయిపై ఒత్తిడి ఉండదని దీంతో ముడిచమురు, బంగారాన్ని దిగుమతు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం పసిడి దిగుమతులు రెండు నెలలుగా దాదాపు జీరోకు పడిపోయాయని గుర్తుచేశారు.

75 నుంచి 76 మధ్య ప్రభుత్వం తీసుకున్న చర్యలను పరిశీలిస్తే ఇదే ధోరణి కొనసాగే అవకాశం ఉందని ఎస్‌బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ తెలిపారు. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ 75 నుంచి 76 మధ్య ఉందని, బ్రెంట్ క్రూడాయిల్ ధర అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్‌కు 39గా ట్రేడ్ అవుతోందని వివరించారు. బంగారం దిగుమతి తగ్గడం, చమురు ధరలు ఇలాగే ఉండటం, కేంద్రం చర్యలతో రూపాయి నిలకడగా ఉంటుందని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.