ప్రేమ.. దీనిని ఫీల్ అవ్వని వారుంటూ ఎవరూ ఉండరు. స్త్రీలు అయినా, పురుషులు అయినా దీనిని అనుభవించని వారు లేరు అని అనడంలో ఎటువంటి సందేహాం లేదు. వయసుతో సంబంధం లేకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క వయసులో ప్రేమలో పడుతుంటారు. ఫలానా సమయంలో ప్రేమ పుడుతుందని ఎవరికీ తెలియదు. లవ్ అనేది ఎప్పడు మనం జీవితంలో వస్తుందో మనకే తెలియదు. ఎప్పుడు పోతుందో కూడా అంతే. వచ్చేటప్పుడు ఎంత సంతోషంగా స్వాగతిస్తామో.. మన నుంచి దూరం అయ్యేటప్పుడు అంతే సంతోషంగా సాగనంపలేము. బరువెక్కిన హృదయంతో మనసు చేసే చప్పుడు విని.. ఆ నయనాలు చమ్మార్చక తప్పదు.
ఇది ఏ ఒక్కరి జీవితానికి పరిమితమైంది కాదు. అందరీ జీవితాల్లో జరిగేది ఇదే. ప్రియుడు లేక ప్రియురాలు దూరమైనప్పుడు ఆ భాగస్వామి పడే వేదన అంతా ఇంతా కాదు. అది మాటలకు అందనిది. చేతల్లో చూపలేనిది. అయితే స్త్రీ, పురుషుల్లో ఈ బాధ ఎవరికి ఎక్కువగా ఉంటుంది అనే సందేహం చాలామందికి వచ్చే ఉంటుంది. కానీ దానికి సమాధానం దొరికి ఉండకపోవచ్చు చాలామందికి. కానీ అనుభవించిన వారు ఆడ అయినా మగ అయినా.. తమ లాగా ఎవరూ బాధపడి ఉండరు అని భావిస్తుంటారు. అయితే ఇదే అంశాన్ని ప్రాక్టికల్గా తెలుసుకోవాలని అనుకున్నారు బ్రిటన్ కు చెందిన ఓ యూనివర్శిటీ పరిశోధకులు. ఇందుకుగానూ సుమారు లక్షా ఎనభై నాలుగు వేల మంది లవ్ ఫెయిల్యూర్ అయిన వారిని ఎంచుకున్నారు. వారు చేపట్టిన ఈ సర్వేలో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
లవ్ బ్రేకప్ అయినప్పుడు అమ్మాయిలు కంటే అబ్బాయిలే ఎక్కువగా బాధపడుతారంట. బ్రేకప్ కు కారణం ఎవరైనా ఎక్కువ బాధను అనుభవించేది పురుషులే అని ఈ అధ్యయనంలో తేలింది. అమ్మాయిల్లో బాధపడేవాళ్లు ఉన్నా కానీ.. ఎక్కవ శాతం అబ్బాయిలు ఆ పెయిన్ ను తీసుకుంటారంట. దీనిని అందరితో పంచుకునేందుకు కూడా వారు మొగ్గు చూపరంట. బాగా ఇష్టం ఉండే వారికి కానీ.. లేకపోతే బెస్ట్ ఫ్రెండ్స్ కు గానీ చెప్తారని తెలిసింది. కొన్నిసార్లు తమలో తామే విడిపోయిన వారిని మనసులో తలుచుకుంటూ ఉండిపోతారని ఈ సర్వేలో తేలింది.
ఎక్కువ మందికి బ్రేకప్ లు అవడానికి కారణాల పై కూడా ఈ సర్వే జరిగింది. వీటికి గల ముఖ్యకారణం ఒకరి గురించి ఒకరు పూర్తిస్థాయిలో వారి భాగస్వామికి చెప్పకపోవడం. కష్టాలైనా.. సుఖాలైనా.. ప్రేమించిన వారితో చెప్పకపోవడం వల్ల అది వారి మధ్య దూరానికి కారణంగా మారుతుందని పరిశోధకులు తెలిపారు. సర్వేలో భాగస్వామ్యమైన ప్రతి ఐదు మందిలో ఒకరు ఈ కారణాన్నే వెల్లబుచ్చినట్లు పేర్కొన్నారు.
ఈ సర్వేలో వెలుగు చూసిన మరో ఆసక్తి గల అంశం..ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకపోవడం. తన భాగస్వామి చెప్పిన విషయాన్ని మరో వ్యక్తి నమ్మకపోవడంతో కూడా ఎన్నో జంటలు విడిపోతున్నాయని పరిశోధకులు కనుగున్నారు. బ్రేకప్ అయిన సమయంలో చాలా మంది ఆత్మహత్యకు మొగ్గు చూపాలి అని అనుకోవడం కూడా ఇందులో గమనించ దగ్గ విషయం.