కృష్ణా జలాల వినియోగంపై రెండు తెలుగు రాష్ట్రాల కలలకు గండి కొట్టేలా ఉండి బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు. రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలతో కలిపి.. కర్ణాటక.. మహారాష్ట్రలతో కలిపి కొత్తగా నీటి కేటాయింపులు చేయాలని భావించాయి. ఈ అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం బ్రజేశ్ ట్రిబ్యునల్ ముందుకు తీసుకెళ్లాయి. తాజాగా.. ఈ అంశంపై ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది.
విభజనకు ముందు.. ఉమ్మడి రాష్ట్రంలో ఎంత అయితే కృష్ణా జాలాల్ని వినియోగించుకోవాల్సి ఉందో.. అంతే మొత్తాన్ని రెండు తెలుగు రాష్ట్రాలు పంచుకోవాలని..కొత్తగా నీటి కేటాయింపులు ఉండవని తేల్చింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న వాటానే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పంపిణీ జరగాలని పేర్కొంది. ఈ అంశంలో మిగిలినరాష్ట్రాలకు సంబంధం లేదని తేల్చిన ట్రిబ్యునల్.. ఈ ఉదంతంపై విచారణను డిసెంబరు 14కు వాయిదా వేసింది.
తామిచ్చిన తీర్పుపై ఏదైనా అభ్యంతరాలు ఉంటే.. నాలుగు వారాల్లో ట్రిబ్యునల్ దృష్టికి తీసుకురావాలన్న సూచన చేసింది. అయితే.. తీర్పుపై రెండు తెలుగు రాష్ట్రాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం.. ఉమ్మడికి ఏపీకి కేటాయించిన నీటినే రెండు రాష్ట్రాలు పంచుకోవాలని ట్రిబ్యునల్ తీర్పు చెప్పటంతో.. తమ అసంతృప్తిని రెండు రాష్ట్రాలు మరోసారి బ్రజేశ్ ట్రిబ్యునల్ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు.
తాజాగా ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వంతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని ఏపీ అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాసరావు చెబితే.. ఈ తీర్పు దురదృష్టకరంగా తెలంగాణ ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్ రావు వ్యాఖ్యానించారు. బ్రిజేశ్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్న మాటను తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలువురు వ్యాఖ్యానించటం గమనార్హం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/