ఎన్టీఆర్, హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌లు సంబంధించి టీడీపీపై మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు బూమరాంగ్ అవుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న మండిపడ్డారు. లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్‌ను టీడీపీ పక్కన పెడుతోందని కొడాలి నాని ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఎన్టీఆర్‌ను, హరికృష్ణను, జూనియర్ ఎన్టీఆర్‌ను వాడుకుని టీడీపీకి నిజమైన వెన్నుపోటు పొడిచింది కొడాలి నానియేనని బుద్ధా వెంకన్న ధ్వజమెత్తారు.
కాగా నందమూరి హరికృష్ణ అనుచరుడిగా కొడాలి నాని రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆ తర్వాత ఆయన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ తో కొడాలి నాని అత్యంత సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. జూనియర్ ఎన్టీఆర్‌తో సాంబ, అదుర్స్ తదితర సినిమాలను కూడా తెరకెక్కించారు. వాస్తవానికి గుడివాడ టికెట్‌ను 2004లో కొడాలి నానికి ఇప్పించింది జూనియర్ ఎన్టీఆరే కావడం గమనార్హం.
ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన కొడాలి నాని.. జూనియర్ ఎన్టీఆర్ ఎప్పటికీ విమర్శించబోనన్నారు. చావడానికైనా సిద్ధమని.. తనను చంపినా జూనియర్ ఎన్టీఆర్‌ను విమర్శించనని తేల్చిచెప్పారు. నారా లోకేష్ కోసం జూనియర్ ను టీడీపీ దూరం పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి రైతులు తమ పాదయాత్రలో జూనియర్ ఎన్టీఆర్ ను టార్గెట్ చేశారని.. లోకేష్‌కు టీడీపీ బాధ్యతలు అప్పగించడానికే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.
నాని తాజా వ్యాఖ్యలపై బుద్ధా వెంకన్న నిప్పులు చెరిగారు. జూనియర్ ఎన్టీఆర్ తో వైసీపీ మైండ్ గేమ్ ఆడుతోందని ధ్వజమెత్తారు. అందుకే ఆయన్ను అడ్డుపెట్టి టీడీపీపై విమర్శలు చేస్తున్నారని బుద్ధా వెంకన్న విమర్శించారు. అయితే తాము కొడాలి నాని ట్రాప్‌లో పడబోమని చెప్పారు.
చంద్రబాబుపై కొడాలి నాని అనవసర విమర్శలు మానుకోవాలని బుద్ధా హెచ్చరించారు. లేకపోతే కొడాలి నానిని పోస్టుమార్టం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. హరికృష్ణ, వైఎస్సార్ లలో ఎవరు గొప్ప అంటే నాని ఏం సమాధానం చెబుతారని బుద్ధా వెంకన్న నిలదీశారు. వైఎస్సార్ చనిపోయినప్పుడు కొడాలి నాని తదితరులు ఏంచేశారో త్వరలోనే బయటపెడతానని బాంబు పేల్చారు.
కొడాలి నాని ఎన్నికలకు ముందు అప్పుల్లో వున్నారని.. అలాంటిది ఆయనకు ఇప్పుడు వేల కోట్ల రూపాయలు ఎక్కడ నుంచి వచ్చాయని బుధ్దా వెంకన్న ప్రశ్నించారు. దోచుకోవడాలు, దాచుకోవడాలు కొడాలి నానికి.. జగన్‌కు అలవాటేనని తీవ్ర విమర్శలు చేశారు. ఒకప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పునాదులు కదుపుతానని పలుగు పట్టుకుని వెళ్లిన కొడాలి నాని.. ఇప్పుడు వైఎస్సార్‌ను ధీరుడు, శూరుడు అని పొగుడుతున్నారని బుద్ధా వెంకన్న గుర్తు చేశారు.
చంద్రబాబు గురించి మాట్లాడే స్థాయి కొడాలి నానికి లేదని.. రేపు వైసీపీ నుంచి మరొక పార్టీలోకి మారితే జగన్‌ను కూడా నాని తిడతారని బుద్ధా వెంకన్న చెప్పడం గమనార్హం. రెండు రాష్ట్రాల్లో కొడాలి నానిని పిచ్చోడిలా చూస్తున్నారని బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.