మద్య పాన ప్రియులకు.. ముఖ్యంగా బీర్ తాగే వాళ్లకు.. అందులోనూ బడ్‌వైజర్ బీర్‌ను అమితంగా ఇష్టపడేవాళ్లకు ఇది మింగుడుపడని వార్తే. ప్రపంచంలోనే నంబర్ వన్ బీర్ బ్రాండుగా ఉన్న బడ్‌వైజర్ సంచలన ప్రకటన చేసినట్లుగా వార్తలొస్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా బడ్ వైజర్ బీరులో మూత్రం కలుస్తున్నట్లు ఆ సంస్థ అంగీకరించినట్లు కూడా కథనాలు కనిపిస్తున్నాయి. తమ ఉద్యోగులు ఎన్నో ఏళ్లుగా బీర్ ట్యాంకుల్లోకి మూత్ర విసర్జన చేస్తున్నట్లు ఆ సంస్థ ఒప్పుకుందన్నది ఈ వార్తల సారాంశం. వాల్టర్ పావెల్ అనే బడ్ వైజర్ ఉద్యోగి తాను 12 ఏళ్లుగా బీర్ ట్యాంకుల్లోకి మూత్ర విసర్జన చేస్తున్నట్లు వెల్లడించినట్లు ప్రాథమికంగా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత బడ్‌వైజర్ సంస్థ.. తమ కంపెనీలు చాలామంది ఉద్యోగులు ఎన్నో ఏళ్లుగా ఈ పని చేస్తున్నట్లు అంగీకరించినట్లు ఓ కథనం బయటికి వచ్చింది.
ఐతే ఈ వార్తలు ఎంత వరకు నిజం అన్నదానిపై స్పష్టత లేదు. ఈ వార్తలు అబద్ధమంటూ తర్వాత కొత్త కథనాలు మొదలయ్యాయి. తాను బీర్ ట్యాంకుల్లో మూత్ర విసర్జన చేస్తున్నట్లు చెప్పిన అదే ఉద్యోగి.. తర్వాత దీనికి భిన్నమైన ప్రకటన ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. తన స్నేహితులు బడ్‌వైజర్ బీరు కావాలని అడిగినపుడు తాను తమాషాకు తమ బీర్ ట్యాంకుల్లో మూత్ర విసర్జన చేస్తామని అన్నానని.. వాళ్లు అది నమ్మేసి మీడియాకు సమాచారం ఇచ్చారని.. ఇలా వార్తలు పుట్టుకొచ్చాయని వాల్టర్ అన్నట్లుగా ఓ కథనం ప్రచురితమైంది. ఐతే ఈ ప్రచారంలో ఏది నిజమో.. ఏది అబద్ధమో తెలియడం లేదు. బీరులో మూత్రం అనే మాట తలుచుకుంటే మాత్రం బడ్ వైజర్ ప్రియులకు దారుణమైన ఫీలింగ్ కలుగుతోంది. దీనిపై బడ్‌వైజర్ సంస్థ ఏమంటుందో చూడాలి.