ఏపీలో ఇప్పుడు వచ్చిన విద్యుత్ సంక్షోభానికి అసలు కారణం చంద్రబాబేనని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రప్రసాద్ విమర్శలు గుప్పించారు. పవన్ ఫైనాన్స్ అప్పుపై చంద్రబాబు చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు.
చంద్రబాబు ప్రభుత్వం డిస్కంలకు పెద్ద మొత్తంలో బకాయిలు పెట్టిందని బుగ్గన విలేకరులకు వివరించారు. విద్యుత్ ను ఎక్కువ రేటుకు కొనడం వల్ల రూ.2700 కోట్ల మేర నష్టం వాటిల్లిందన్నారు. టీడీపీ ప్రభుత్వం రూ.42వేల కోట్ల అప్పులు మిగిల్చి వెళ్లిందని.. ఇప్పుడు అసత్య ప్రచారం చేస్తోందని బుగ్గన కడిగిపారేశారు.
చంద్రబాబు రాకముందు రూ.1.23 లక్షల కోట్లుగా ఉన్న అప్పు ఇప్పుడు 2.58 లక్షల కోట్లకు పెరిగింది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 9 నెలల జీతాలు ఇవ్వలేదు. బడా కాంట్రాక్టర్లకు మాత్రం ఏప్రిల్ లో దిగిపోయే ముందర 3358 కోట్లు చెల్లించాడు. అదే నెలలో 5వేల కోట్లు అప్పులు చేశాడు. సివిల్ సప్లయ్ కార్పొరేషన్ ను అప్పుల్లో ముంచాడు. డబ్బులన్నీ పసుపు-కుంకమకు వాడేశారు. కాంట్రాక్టర్లకు 1060 కోట్లు చెల్లించాడు. ఎన్నికల ముందర బాబు 38వేల కోట్ల సప్లిమెంటరీ గ్రాంట్ తీసుకొని ఇప్పుడు ఏపీని సంక్షోభంలోకి నెట్టారు. దీని అంతటికీ చంద్రబాబే కారణమని బుగ్గన ఆధారాలతో సహా కడిగిపారేశారు.
విద్యుత్ వ్యవస్థను అస్తవ్యస్తం చేసింది చంద్రబాబేనని బుగ్గన ఫైర్ అయ్యారు. 7200 కోట్ల నష్టాన్ని 14వేల కోట్లకు పెంచాడని ఆరోపించాడు. 42వేల కోట్ల బిల్లుల అప్పు పెట్టిపోయారని మండిపడ్డారు. మధ్యాహ్న భోజనం - విద్యుత్ బకాయిలు - ఆస్పత్రి వస్తువుల అప్పులు - ఔట్ సోర్సింగ్ జీతాలు ఇలా అన్నింటిని పెండింగ్ లో పెట్టారని బుగ్గన ధ్వజమెత్తారు. బాబు దిగిపోతూ ఇప్పుడు రూ.65వేల కోట్లు చెల్లింపు బాధ్యతలు తమ నెత్తిన పెట్టారని బాబు బండారాన్ని బయటపెట్టారు బుగ్గన.