తాజాగా ముఖ్యమంత్రి జగన్ ఆద్వర్యంలో జరిగిన వర్క్ షాప్ లో పనిచేయని ఎమ్మెల్యేలు, మంత్రులు ఇంచార్జులు 38 దాకా ఉన్నారంటూ ఒక లిస్ట్ బయటకు వచ్చింది. దాని మీద విపరీతంగా ప్రచారం సాగుతోంది. చిత్రమేంటి అంటే ఆ 38 మందిలో సీనియర్ నేతలు, మంత్రులు చాలా సార్లు ఆ నియోజకవర్గంలో గెలిచిన వారు ఉన్నారు. మరి వారు పనిచేయడం లేదని, వచ్చే ఎన్నికల్లో ఓడిపోతారు అంటూ సర్వే నివేదికలు రావడమేంటి, దాన్ని జగన్ వర్క్ షాప్ లో ఉంచి క్లాస్ తీసుకోవడమేంటి అన్నదే చర్చగా ఉంది.
వంద రోజుల వ్యవధిలో పనితీరు కనుక మార్చుకోకపోతే కచ్చితంగా వారి విషయంలో వేరేగా ఆలోచించాల్సి ఉంటుందని, కొత్త వారిని ఆ ప్లేస్ లో పెట్టాల్సి ఉంటుందని జగన్ అన్నట్లుగా వార్తలు వచ్చాయి. మరి ఆ విధంగా చూస్తే ఒక విశ్వసనీయమైన సమాచారంగా లిస్ట్ ఒకటి బయటకు లీక్ అయింది అంటున్నారు. ఆ లిస్ట్ లో చాలా మంది దిగ్గజ నేతలు ఉన్నారు. వారిలో మంత్రుల జాబితా చూస్తే సీదరి అప్పలరాజు, గుడివాడ అమరనాధ్, దాడిశెట్టి రాజా, పినిసే విశ్వరూప్, జోగి రమేష్, ఆదిమూలం సురేష్, బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి, గుమ్మలూరు జయరాం ఉన్నారు.
ఇక ఎమ్మెల్యేలలో చూసుకుంటే పెట్ల ఉమా శంకర్ గణేష్, శ్రీనివాసనాయుడు, ఎలీజా, పొన్నాడ వెంకట సతీష్ కుమార్, కొడాలి నాని, వసంత క్రిష్ణ ప్రసాద్, మేకా ప్రతాప్ అప్పారావు, మేకతోటి సుచరిత, ముస్తాఫా, ఉండవల్లి శ్రీదేవి, మద్దిశెట్టి వేణుగోపాల్, బాలినేని శ్రీనివాసరెడ్డి, మహీధర్ రెడ్డి, మధుసూదన యాదవ్, కిలివేటి సంజీవయ్య, పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, మేడ మల్లికార్జున రెడ్డి, ఎస్ రఘురామిరెడ్డి, వై సాయిప్రసాదరెడ్డి, చెన్నకేశవరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, అనత వెంకటరామిరెడ్డి, కేతినేని వెంకట రామిరెడ్డి ఉన్నారు.
ఇక వైసీపీ ఇంచార్జులుగా ఉన్న వారిలో ఆడారి ఆనంద్ ( విశాఖ పశ్చిమ), కేకే రాజు (విశాఖ ఉత్తరం ), ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు (మండపేట), ఎంపీ మార్గాని భరత్ రాం ( రాజమహేంద్రవరం నగరం), ఎంపీ వైవీ అవినాష్ రెడ్డి ( ముఖ్యమంత్రి జగన్ పులివెందుల అసెంబ్లీ బాధ్యతలు అప్పగింత), ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ ( హిందూపురం) పనితీరు బాగులేని వారి జాబితాలో ఉన్నారు.
ఇక ఈలిస్ట్ ని ఒకసారి గమనిస్తే ఇందులో గుడివాడ నుంచి నాలుగు సార్లు గెలిచిన కొడాలి నాని ఉన్నారు. అలాగే, ప్రకాశం జిల్లా నుంచి అయిదు సార్లు గెలిచిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నారు. ఇక ముఖ్యమంత్రి సోదరుడు పులివెందుల బాధ్యతలు చూసే వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నారు. మరో దిగ్గజ నేత నాలుగు సార్లు గెలిచిన మహీధర్ రెడ్డి ఉన్నారు. అలాగే కర్నూల్ జిల్లాకు చెందిన ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి ఉన్నారు.
మరి వీరందరికీ పనితీరు బాలేదని చెప్పి జగన్ తీసేయగలరా అన్న చర్చ ముందుకు వస్తోంది. ఇక గడప గడపకు అని ఒక ప్రోగ్రాం పెట్టారు. అక్కడ తిరిగితేనే గెలిచినట్లు లేకపోతే లేదు అన్నట్లుగా కొలమానం పెట్టి దాని చూసి పనితీరుని అంచనా కడుతున్నారు. మరి గతంలో అన్నేసి సార్లు గెలిచిన వారు ఎవరూ గడప గడప ప్రోగ్రాం లో పాల్గొనలేదే. అలాంటి కార్యక్రమాలు ఏవీ చేయకపోయినా వారు జనం గుండెల్లో ఉన్నారు. అందుకే పదే పదే గెలుస్తున్నారు అనుకోవాలి.
కానీ జగన్ అయితే ఒక్కటే పట్టుకున్నారు. గడప గడపకు తిరగడంలేదు అని అంటున్నారు. అందుకే ఫెయిల్ అని అంటున్నారు. రాజకీయాల్లో నిజంగా అలా ఉంటుందా అలా జరుగుతుందా గడప చుట్టూ ఎంత ఎక్కువగా కనిపిస్తే వారే అనేక సార్లు ఎన్నికల్లో గెలుస్తారు అన్న విజయ సూత్రం కనుక ఉంటే ఇప్పటిదాకా ఓడిన వారు ఏమైనా ఇవేమీ తెలియని వారా. ఈ షార్ట్ కట్ మెదడ్ ని అందరూ ఈజీగా ఫాలో అవుతారు కదా. జనాల కళ్లకు రోజుకు ఒకసారేంటి పది సార్లు కనిపించి మరీ వారిని బుట్టలో వేసుకుని గెలిచేస్తారు.
ఓటమి అన్నదే లేకుండా విజేతలుగా చరిత్రలో నిలుస్తారు. కానీ రాజకీయాల్లో అలా అసలు జరగదు. తమ కళ్ల ముందు ఉన్నారనో పదే పదే కనిపించారో జనాలు ఎవరికీ గుడ్డిగా ఓటేయరు. వారు ఓటేసినపుడు చాలా విషయాలను గమనంలోకి తీసుకుంటారు. అందులో జగన్ నమ్ముకున్న సంక్షేమం కూడా ఉంటుంది. కానీ మిగిలిన విషయాలు కూడా వారు పట్టించుకుంటారు. అలాగే రాష్ట్రంలో అభివృద్ధిని చూస్తారు. సీఎం కి కూడా మార్కులు వేస్తారు. ఎమ్మెల్యేలు మంత్రుల వ్యవహార శైలి కూడా చర్చకు వస్తుంది. ఇలా ఎన్నో ఆలోచించిన మీదటనే జనాలు ఓటేస్తారు అన్నది మరచిపోకూడదు.
అందువల్ల గడప గడపకూ తిరగండీ మళ్ళీ ఎమ్మెల్యేలు ఎలా కారో నేను చూస్తాను అని జగన్ చెప్పే విషయాలు మాత్రం వైసీపీలోనే కాదు రాజకీయంగానూ చర్చకు తావిస్తున్నాయి. ప్రజల వద్ద గెలుపు కోసం ఏ దగ్గర దారీ లేదు అన్నది అంతా గుర్తించాలి. ఇక అందరికీ ఒకే గాటకు కట్టడమూ మానుకోవాలి. గెలుపు కోసం ఎమ్మెల్యేలు ఎవరి మార్గాలు వారికి ఉంటాయి. అందుకే కొడాలి నాని బాలినేని వంటి వారు వరసగా గెలవగలుస్తున్నారు అని అర్ధం చేసుకోవాలని అంటున్నారు.
ఏది ఏమైనా గడపగడప అంటూ లిస్ట్ బయటకు తీసి పని చేయని వారికి టికెట్లు ఇవ్వమని చెబుతున్న జగన్ బయటకు లీక్ అయిన 38 నాయకులకు టికెట్ ఇవ్వకుండా ఉండగలరా అంటే దానికి జవాబు లేనే లేదు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే గడప గడప ప్రోగ్రాం అన్నది ఒక్కటే పట్టుకుని వైసీపీ ముందుకు వెళ్తే ఫలితాలు అనుకూలంగా వస్తాయా అంటే ఆలోచించాల్సిందే అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.