ప్రస్తుతం దేశంలోని అన్ని పార్టీలు ఎన్నికల్లో గెలవాలంటే ఉచితాలు ఎరగా వేస్తున్నాయని కేంద్ర ఎన్నికల సంఘం అభిప్రాయ పడి.. ఎన్నికల వాగ్దానాలకు అయ్యే వాస్తవ ఖర్చు ఓటర్లకు వెల్లడించాలని లేఖ రాసింది. దీనిపై బీజేపీ స్పందించగా.. తాజాగా కాంగ్రెస్ పార్టీ కూడా స్పందించింది.
ఉచిత వాగ్దానాలను నియంత్రించే అధికారం.. ఎన్నికల సంఘానికి లేదని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడింది. ఎన్నికల చట్టాలను సరిగ్గా వినియోగించటం ద్వారా ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించటంపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేసింది. ఈనెల 4న ఎన్నికల ప్రవర్తనా నియమావళికి సవరణలు ప్రతిపాదించిన ఎన్నికల సంఘం.. రాజకీయ పార్టీలు తమ ఎన్నికల వాగ్దానాలకు అయ్యే వాస్తవ ఖర్చు ఓటర్లకు వెల్లడించాలని లేఖ రాసింది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఈ మేరకు వివరణ ఇచ్చింది. ఉచిత వాగ్దానాలు, సంక్షేమ పథకాల మధ్య రాజకీయ పార్టీల వ్యవహారాలని.. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిపై నిర్ణయాలు తీసుకుంటాయని పేర్కొంది. రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత వాగ్దానాలను అడ్డుకోవడం అంటే.. తమ అధికారాలను సరిగా వినియోగించుకోలేక దొడ్డిదారిలో పార్టీలను నిలువరించడమేనని కాంగ్రెస్ తీవ్రంగా వ్యాఖ్యానించింది.
అంతకుముందు బీజేపీ సైతం ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ప్రకటించే తాయిలాలు, ప్రజాసంక్షేమ పథకాల మధ్య వ్యత్యాసాన్ని వివరిస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ఓటరు చైతన్యంపై రాజకీయ పార్టీలు దృష్టిసారించాలే తప్ప.. ప్రజలు ఒకరిపై ఆధారపడి జీవించేలా చేయకూడదని బీజేపీ స్పష్టం చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీఆలోచనలకు అనుగుణంగా ఈసీకి తమ స్పందన తెలియజేసినట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి.
ఉచితాల విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీల మధ్య చాలా రోజులుగా వివాదం నడుస్తోంది. తమ నుంచి వసూలు చేసిన డబ్బును ఉచితాలకు ఉపయోగిస్తే పన్ను చెల్లింపుదారులు ఎంతో బాధపడతారంటూ కొద్ది రోజుల క్రితం ప్రధాని వ్యాఖ్యానించారు. దీన్ని ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. ధరల పెరుగుదలతో బాధపడుతున్న సామాన్య ప్రజలకు విద్య, వైద్యాన్ని ఉచితంగా ఎందుకు అందించకూడదని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు. అటువంటి వాటిని ఉచితాలు అని పేర్కొంటూ సామాన్య పౌరుడిని అవమానపరచొద్దని హితవు పలికారు. ఇక, ఈ విషయంపై ఎన్నికల సంఘం ఒక నిర్ణయం తీసుకుని.. దీనిని సుప్రీంకోర్టుకు తెలియజేయాల్సి ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.