జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమకు తిరుపతి వెంకటేశ్వరస్వామిగా, దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా రూపంలో మమ్నలను ఆదుకునేందుకు వచ్చాడని భూసేకరణకు వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్న కొందరు రైతుల వ్యాఖ్యానించారు. పెనుమాకలో పవన్ పలువురు రైతుల నుంచి సమస్యలు వింటుంటగా ఓ మహిళా రైతు మాట్లాడుతూ తనకు ఇక్కడ 30 ఎకరాల పొలం ఉందని...సంవత్సరానికి మూడు పంటలు పండే ఈ సారవంతమన పొలాన్ని తాను ఎలా ఇవ్వాలని వాపోయింది.
పవన్ వచ్చి తన పొలాన్ని చూసి రాజధానికి ఇచ్చేయమంటే ఇచ్చేస్తానని ఆమె చెప్పింది. తమ సమస్యలు చెప్పుకునేందుకు లారీలపై ఇక్కడకు వచ్చామని..అయితే తమ కుర్రాళ్లలో కొందరిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి స్టేషన్ లో బంధించారని ఆమె పవన్ ముందు తన ఆవేదన వ్యక్తం చేసింది. మన వంగవీటి రంగా మళ్లీ వచ్చాడు..ఆయనతోనే మన సమస్యలు చెప్పుకుందామని తాను వారితో అన్నట్టు ఆ మహిళ పవన్ కు చెప్పడంతో ఒక్కసారిగా హర్ష ధ్వానాలు మిన్నంటాయి.