ఏపీలోని న్యాయమూర్తులను, వారి తీర్పులను తప్పుపడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన కేసులో సీబీఐ దూకుడు పెంచింది. తాజాగా అరెస్ట్ లు మొదలుపెట్టింది. పోస్టులు పెట్టిన వారిపై కొరఢా ఝలిపిస్తోంది. ఇప్పటికే నిందితులతో ఓ భారీ జాబితా తయారు చేసిన సీబీఐ.. తాజాగా కడప జిల్లాల నుంచి అరెస్ట్ లు ప్రారంభించింది. దీంతో అప్పట్లో కోర్టు తీర్పులపై కామెంట్లు చేసిన వారిలో వణుకు మొదలైంది. తాజాగా అరెస్ట్ చేసిన వారిని కస్టడీలోకి తీసుకుంటున్న సీబీఐ దీని వెనుక ఎవరున్నారనే దానిపై విచారణ జరుపుతోంది.
గత ఏడాది హైకోర్టు తీర్పులపై కొందరు న్యాయమూర్తులను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో విచ్చలవిడిగా పోస్టులు పెట్టారు. అనుకూలంగా తీర్పులు రావడం లేదని వ్యతిరేకంగా ఇస్తున్నారని సోషల్ మీడియాలో హోరెత్తించారు.రోడ్లపై బ్యానర్లు కట్టి వ్యతిరేకించారు.
హైకోర్టు జడ్జీలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వ్యవహారంలో గుంటూరుకు చెందిన న్యాయవాది లక్ష్మీనారాయణ చేసిన ఫిర్యాదు ఆధారంగా హైకోర్టు విచారణ చేపట్టింది. తొలుత స్థానిక పోలీసులు, తర్వాత సీఐడీ దర్యాప్తు చేపట్టింది. అయితే సీఐడీ విచారణ సాగకపోవడంతో హైకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగించింది.
అప్పటి నుంచి సీబీఐ అధికారులు ఈ పోస్టులు, వాటి మూలాలపై దర్యాప్తు ప్రారంభించారు. నిందితులతో భారీ జాబితానే తయారు చేశారు. ఇందులో ఒక్కొక్కరిగా అరెస్ట్ లు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
న్యాయమూర్తులను దూషించిన కేసులో సీబీఐ తయారు చేసిన నిందితుల జాబితా పెద్దగానే ఉన్నట్టు తేలింది. అయితే ఇందులో 15వ నిందితుడిగా ఉన్న వ్యక్తిని సీబీఐ ముందుగా అరెస్ట్ చేసింది. కడపకు చెందిన లింగారెడ్డి రాజశేఖర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది.తొలి 14 మందిని వదిలి 15వ నిందితుడిని అరెస్ట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇక స్థానిక కోర్టులో కస్టడీ పిటీషన్ వేసి లింగారెడ్డిని సీబీఐ అదుపులోకి తీసుకుంది. రెండు రోజుల కస్టడీలో రాజశేఖర్ రెడ్డి నుంచి సీబీఐ మరిన్ని వివరాలు రాబట్టబోతోంది.