వైసీపీ నర్సాపురం రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు సమాచారం.. ఎస్బీఐ చెన్నై బ్రాంచ్ డిప్యూటీ జనరల్ రవిచంద్రన్ ఫిర్యాదు మేరకు ఈ కేసు, ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు తెలిసింది.
ఇంద్ భారత్ పవర్ ప్రాజెక్ట్ కోసం రఘురామకృష్ణం రాజు గతంలో 273.84 కోట్ల రుణం తీసుకొని ఎగవేశారని ఈ మేరకు ఫిర్యాదు చేసినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఫోర్జరీ డాక్యుమెంట్లతో బ్యాంకును మోసం చేసి నిధులను దారి మళ్లించినట్టు మేనేజర్ రవిచంద్రన్ ఫిర్యాదులో పేర్కొన్నారని తెలిసింది..
ఈనెల 23న సీబీఐకి బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. దీంతో బుధవారం రఘురామకృష్ణం రాజు సహా మరో 9మందిపై సీబీఐ కేసు నమోదు చేసింది.
అయితే ఈ కేసు, ఎఫ్ఐఆర్ పై ఎంపీ రఘురామకృష్ణం రాజు ఇంతవరకు స్పందించలేదు.