మరో సంచలనం చోటు చేసుకుంది. ప్రముఖ మీడియా సంస్థ ఎన్డీటీవీ సహ వ్యవస్థాపకుడు.. ఎగ్జిక్యూటివ్ కో ఛైర్మన్ ప్రణయ్ రాయ్ ఇంటి మీద సీబీఐ సోదాలు నిర్వహిస్తుండటం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఒక బ్యాంకుకు నష్టం వాటిల్లేలా చేశారన్న ఆరోపణల మీద ప్రణయ్ రాయ్.. ఆయన సతీమణి పైనా ఫిర్యాదు నమోదు చేసినట్లుగా చెబుతున్నారు.
బ్యాంకుకు డబ్బులు చెల్లించకుండా నష్టం కలిగించారన్న ఆరోపణలతో సీబీఐ ఈ సోదాలు నిర్వహించినట్లుగా చెబుతున్నారు. ఈ ఫిర్యాదులో భాగంగా ప్రణయ్ రాయ్ తో పాటు.. ఆయన సతీమణి రాధికా రాయ్ తో పాటు.. మరో ప్రైవేటు కంపెనీపైన కేసులు నమోదు చేసినట్లుగా సమాచారం.
కొన్ని మీడియా సంస్థల కథనాల ప్రకారం.. ఐసీఐసీఐ బ్యాంకుకు రూ.48 కోట్ల నష్టాన్ని వాటిల్లేలా చేశారన్నది ప్రణయ్ రాయ్ మీద ఉన్న అభియోగంగా చెబుతున్నారు. అయితే.. రుణం తీసుకొని తిరిగి చెల్లించకపోవటమా? లేదంటే.. మరింకేదైనా కారణంతో ఆ బ్యాంకుకు నష్టం వాటిల్లేలా చేశారా? అన్న దానిపై స్పష్టత రావటం లేదు. ఇక.. సీబీఐ సోదాల విషయానికి వస్తే.. ఢిల్లీ.. డెహ్రాడూన్ లోని ప్రణయ్ రాయ్ దంపతులకు చెందిన ఆస్తుల మీద సీబీఐ సోదాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. సోదాలు పూర్తి అయి.. ఛార్జీషీట్ దాఖలు చేస్తే కానీ.. ఈ కేసుకు సంబంధించిన పూర్వాపరాలు మొత్తం బయటకు వచ్చే ఛాన్స్ లేదన్న మాట వినిపిస్తోంది. ఏమైనా ఇంతకాలం రాజకీయ నేతలు.. వ్యాపార వర్గాల మీద సోదాలు చేసిన సీబీఐ ఇప్పుడు అందుకు భిన్నంగా ప్రముఖ మీడియా సంస్థకు చెందిన కీలక వ్యక్తి ఇంటిపై సోదాలు నిర్వహించటం ఇప్పుడుసర్వత్రా సంచలనంగా మారిందని చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/