కరోనా సెకండ్ వేవ్ దేశంలో అల్లకల్లోలం సృష్టించింది. మరణ మృదంగం వినిపించింది. వేలమంది ప్రాణాలు కోల్పోయారు. కుటుంబాలకు కుటుంబాలే మరణశయ్యపై పడుకున్నాయి. ఇక ఆక్సిజన్ కొరతతో మహారాష్ట్రంలో 25మంది వరకూ ఒకే రోజు ఒకే ఆస్పత్రిలో చనిపోయారు.దేశవ్యాప్తంగా వందలాది మందికి ఆక్సిజన్ అందక ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. ఇందంతా మొన్నటివరకు జరిగిన పచ్చినిజం. అన్ని ప్రధాన మీడియాల్లోనూ వచ్చేసింది.
అయితే దీనిపై కేంద్రప్రభుత్వం మాత్రం తూచ్ అలాంటిదేమీ లేదంటోంది. కరోనా సెకండ్ వేవ్ సమయంలో కేవలం ఒక రాష్ట్రంలో మాత్రమే ఆక్సిజన్ కొరత కారణంగా ఒకరు అనుమానాస్పద స్థితిలో మరణించినట్లు కేంద్రం చెబుతోంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ చెప్పుకొచ్చారు.
ఇప్పటివరకు అందిన వివరాల ప్రకారం కేవలం ఒక రాష్ట్రంలోనే ఆక్సిజన్ కొరత కారణంగా ఒకరు మరణించినట్టు పేర్కొన్నారు. ఆరాష్ట్రం పేరును బయటపెట్టలేదు. మిగిలిన రాష్ట్రాలేవీ అలాంటి మరణాలకు సంబంధించిన వివరాలను వెల్లడించలేదంటూ లవ్ అగర్వాల్ తెలిపారు.
కరోనా సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ కొరతతో చనిపోయిన వారి వివరాలను ఈనెల 13న పార్లమెంట్ వర్షకాల సమావేశాలు ముగిసేలోగా అందజేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్రం కోరింది. అయితే కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా 13 రాష్ట్రాలు వివరాలను సమర్పించాయి.
ఆ వివరాల ప్రకారం.. ఆక్సిజన్ కొరత కారణంగా పంజాబ్ లో పలువురు కోవిడ్ రోగులు ప్రాణాలు కోల్పోయారని తెలిసింది. అయితే ఆక్సిజన్ కొరతతో దేశంలో ఎలాంటి మరణాలు సంభవించలేదని పార్లమెంట్ లో కేంద్రం వెల్లడించింది. ఈవిషయంపై రాష్ట్రాలు వివరాలేవీ సమర్పించలేదని పేర్కొంది.