కోవిషీల్డ్ టీకా పై కేంద్రం సంచలన నిర్ణయం .. అలా చేయాల్సిందే !

Update: 2021-06-02 10:30 GMT
దేశంలో ఇప్పుడిప్పుడే కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ జోరు తగ్గుముఖం పడుతోంది. అలాగే దేశంలో కరోనా మహమ్మారి కేసుల సంఖ్య కూడా తగ్గుతూ వస్తుంది. అలాగే దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా కొనసాగుతోంది. దేశంలో కరోనా వ్యాక్సిన్లకు సంబంధించి మొదటి నుంచి రకరకాల ప్రకటనలు వస్తూనే ఉన్నాయి. మహారాష్ట్ర పుణెలోని సీరం ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా  ఉత్పత్తి చేస్తున్న కోవిషీల్డ్‌ నే తీసుకుంటే, ఆ వ్యాక్సిన్ 2 డోసుల మధ్య కాలం 28 రోజులు ఉండాలని మొదట్లో అన్నారు. ఆ తర్వాత 6 వారాలైనా పర్వాలేదని, ఇలా లేటుగా రెండో డోస్ వేసుకుంటే,యాంటీబాడీలు ఇంకా ఎక్కువగా ఉత్పత్తి అవుతాయని అన్నారు.

తాజాగా మరో వాదన తెరపైకి వచ్చింది. ఏంటంటే అసలు ఈ  వ్యాక్సిన్‌ ని రెండు డోసులుగా ఎందుకు ఒకే డోసుగా వేస్తే సరిపోతుందిగా అని, కొంతమందేమో, కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్లను కలిపేయవచ్చుగా అంటారు. ఇంకొందరేమో మొదటి డోసు ఓ వ్యాక్సిన్, రెండో డోసు మరో వ్యాక్సిన్ వేయించుకుంటే ఏమవుతుంది అని ప్రశ్నిస్తారు. ఇలా రకరకాల ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. తాజాగా కేంద్రం  కోవిషీల్డ్ వ్యాక్సిన్ సింగిల్ షాట్ వ్యాక్సిన్ అవ్వదు అని తెలిపింది. వ్యాక్సిన్ల ప్రోటోకాల్‌ లో మార్పు ఉండదన్న కేంద్రం ,ఎవరైనా సరే 2 డోసులు వేయించుకోవాల్సిందే అని తెలిపింది.  2 డోసుల విధానంలో ఏ మార్పూ లేదు. కోవిషీల్డ్ అయినా, కోవాగ్జిన్ అయినా 2 డోసులు వేసుకోవాల్సిందే. కోవిషీల్డ్ 2వ డోసును, 12 వారాల తర్వాత వేస్తారు. అదే కోవాగ్జిన్ రెండో డోసును 4 నుంచి 6 వారాల్లో వేస్తారు. ఇదే షెడ్యూల్ కంటిన్యూ అవుతుంది.  దీనిపై ఏ కన్‌ ఫ్యూజనూ వద్దు అని నీతి ఆయోగ్‌కి చెందిన డాక్టర్ వీకే పాల్ తెలిపారు.

రెండు వ్యాక్సిన్లు  కలిపివేసుకుంటే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది, ఇమ్యూనిటీ బాగా పెరుగుతుందని అని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దాన్ని పాల్ తీవ్రంగా ఖండించారు. ఇలా చేస్తే... సైడ్ ఎఫెక్టులు వచ్చే అవకాశాలు ఉంటాయి. దీనిపై చాలా దేశాల్లో పరిశోధనలు జరుగుతున్నాయి. అవి పరిశోధనలు మాత్రమే. కాబట్టి... వ్యాక్సిన్ ప్రోటోకాల్‌లో ఇప్పటికి ఏ మార్పూ ఉండదు" అని పాల్ తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రోజూ 30 లక్షల మంది దాకా వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. గత 4 నెలలుగా 21కోట్ల 20లక్షల 66వేల 614మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. వ్యాక్సిన్ల పంపిణీ, ఉత్పత్తికి మరింత వేగంగా చర్యలు తీసుకోవాలనీ... దేశవ్యాప్తంగా వాటిని చేరవెయ్యాలనే డిమాండ్లు వస్తున్నాయి.
Tags:    

Similar News