కరోనా కల్లోలంలో కేంద్రం నుంచి నిధులు ఆశించడం అనేది అత్యాశే అవుతుంది. ఆదాయం లేక అన్నింటిని ప్రైవేటు పరం చేస్తూ చేతులు దులుపుకుంటున్న కేంద్రం ఇప్పుడు దేశంలో ఏ రాష్ట్రానికి.. దేనికి నిధులు ఇచ్చే పరిస్థితుల్లో లేదన్నది వాస్తవం. కేవలం ఆరోగ్యం, కరోనా వైరస్ నివారణకు నిధులు, వ్యాక్సిన్ పంపిణీపైనే ఫోకస్ చేసింది.
ఏపీ పరిపాలన రాజధాని విశాఖలో ఏపీ ప్రభుత్వం తలపెట్టిన విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుకు కూడా కేంద్రం నిధులు ఇవ్వడానికి మెలికపెడుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఏపీకి రాజధాని నగరమైన విశాఖలో సకల సదుపాయాలు కల్పించేందుకు జగన్ సర్కార్ మెట్రోను తెరపైకి తెచ్చింది. దీన్ని మూడు దశలలో చేపట్టడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మొత్తం 76.90 కిలోమీటర్ల మేర లైట్ మెట్రో ప్రాజెక్ట్ ను చేపట్టాలని ప్రతిపాదించారు. ఒక కిలోమీటర్ కు రూ.197 కోట్ల రూపాయలు ఖర్చుచేయాలని అంచనాలు రూపొందించారు.
మెట్రో ప్రాజెక్టును కేంద్ర-రాష్ట్ర భాగస్వామ్యంతో నిర్మాణం చేస్తారు. ఇందులో కేంద్రం వాటా నిధుల కోసం ప్రతిపాదనలను ఏపీ ప్రభుత్వం పంపింది. అయితే ముందుగా రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద నిధులు విడుదల చేస్తేనే తాము నిధులు ఇస్తామని కేంద్రం దాటవేసే వ్యవహారం చేస్తోందని.. అప్పుల్లో ఉన్న ఏపీలో ఎలాగూ నిధులు ఇవ్వదుకాబట్టి తప్పించుకోవచ్చని ప్లాన్ చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.
ఏపీ ఆర్థిక పరిస్థితి చూసి కేంద్రం ఇలా క్యాష్ చేసుకుంటోదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో విశాఖ మెట్రోపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రాజెక్ట్ ముందడుగు వేసే పరిస్థితులు కనిపించడం లేదు.