ఆరుగాలం కష్టించే రైతులపై కేంద్రం కటాక్షించింది. రైతులను ఆదుకునేలా కొన్ని నిర్ణయాలు బడ్జెట్‌లో ఉన్నాయి. రైతుకు పునర్జీవం కల్పించేలా సభలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం చేశారు. కరువుతో అల్లాడుతున్న రైతును ఆదుకునేందుకు, ఆర్థిక సహాయం, బీమా వంటి సౌకర్యాలతో పాటు రైతు ఆదాయం రెట్టింపు చేసేలా కేంద్ర బడ్జెట్ రూపకల్పన చేశారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు కూడా కేంద్ర బడ్జెట్‌లో ప్రోత్సాహకాలు ఉన్నాయి.
ఆకాంక్ష, ఆర్థికాభివృద్ది, సంక్షేమం అనే ఇతివృత్తంతో బడ్జెట్ రూపొందించామని చెబుతూ ఆర్థికమంత్రి నిర్మల రైతులకు ఆశలు రేకెత్తించేలా పలు అంశాలు వెల్లడించారు. వ్యవసాయ అభివృద్ధికి 16 అంశాలతో కార్యచరణ ప్రణాళికలను ప్రకటించారు. అత్యాధునిక వ్యవసాయానికి కేంద్రం తోడ్పాటు అందిస్తుందని తెలిపారు.
బడ్జెట్ ప్రసంగంలో భాగంగా మంత్రి నిర్మల పేర్కొన్న అంశాల్లో ప్రధానమైనవి..
- రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యం
- 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు కృషి
- 6.11 కోట్ల మంది రైతులకు బీమా సౌకర్యం
- వ్యవసాయానికి సంబంధి 3 కొత్త చట్టాలను తీసుకు రానున్నట్టు తెలిపారు.
- కరువు పీడిత రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు
- నాబార్డు ద్వారా రీ ఫైనాన్స్ పునరుద్ధరణ
- వ్యవసాయ వస్తువుల రవాణాకు కిసాన్ రైలును ఏర్పాటు
బడ్జెట్ కేటాయింపులు ఇలా ఉన్నాయి.
- వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ. 2.83 లక్షల కోట్లు
- గ్రామీణాభివృద్ధి రంగాలు రూ. 1.23 లక్షల కోట్లు
- 2022-23 నాటికి చేపల ఉత్పత్తిని 200 లక్షల టన్నులకు పెంచనున్నాం.
- ఫిషరీస్ విస్తరణ పనుల్లో సాగర్ మిత్రాస్ పేరుతో గ్రామీణ యువత కు ప్రోత్సాహం
- బంజరు / తడి భూముల్లో సౌర యూనిట్లను ఏర్పాటుకు రైతులను అనుమతి
- గ్రిడ్ల కు విద్యుత్ సరఫరా.
100 నీటి పీడన జిల్లాలకు సమగ్ర చర్యలు ప్రతిపాదన
మత్స్య సంపద ఎగుమతుల లక్ష్యం 200 టన్నులు
కేంద్ర, రాష్ట్రాలు కలిపి ఉద్యానవన పంటలకు అదనపు నిధుల కేటాయింపులు, ప్రత్యేక క్లస్టర్ల ఏర్పాటు