కేంద్ర ఎన్నికల కమిషనర్ లావాసా రాజీనామా

Update: 2020-08-18 15:18 GMT
కేంద్ర ఎన్నికల కమిషనర్ పదవికి సీనియర్ ఐఏఎస్ అధికారి అశోక్ లావాసా రాజీనామా చేయడం ఢిల్లీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆయన రాజీనామా చేసి ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) వైస్ చైర్మన్ గా ఆయన వెళుతున్నారు.

అయితే కేంద్ర ఎన్నికల కమిషన్ లో కేంద్రంలోని మోడీ పెత్తనం తట్టుకోలేకే ఆయన ఏడీబీ బ్యాంకు వైస్ చైర్మన్ గా వెళుతున్నారని ఢిల్లీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.ఎందుకంటే ఎన్నికల కమిషనర్ గా లావాసాకు ఇంకా రెండేళ్ల పదవి కాలం ఉంది. అంతేకాకుండా తదుపరి ప్రధాన ఎన్నికల కమిషనర్ రేసులో ఈయనే ఉన్నారు.అయినప్పటికీ ఈ పదవిని లావాసా వదులుకోవడం చర్చనీయాంశంగా మారింది.

మోడీతో పడకనే లావాసా రాజీనామా చేసే రాష్ట్రపతి రామ్ నాథ్ కు లేఖ పంపిచారని అంటున్నారు. సెప్టెంబర్ లో ఆయన ఆసియా బ్యాంకులో బాధ్యతలు చేపడుతారు. ఆగస్టు 31లోగా తనను రిలీవ్ చేయాలని రాజీనామా లేఖలో లావాసా కోరినట్లు సమాచారం.
Tags:    

Similar News