పార్టీ పెట్టకుండానే భారీ అంచనాలు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పైన ఉన్న సంగతి తెలిసిందే. తమిళనాడు రాజకీయాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తారన్న మాట బలంగా వినిపిస్తోంది. తాను రాజకీయాల్లోకి వస్తానని చెప్పినప్పటికీ.. అదెప్పడు? అన్న విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వని వైనం కొట్టొచ్చినట్లుగా కనిపించక మానదు. ఇదిలా ఉంటే.. రజనీపైతాజాగా కేంద్రమంత్రి కమ్ బీజేపీ నేత పొన్ రాధాకృష్ణనన్ ఆసక్తికరవ్యాఖ్యలు చేశారు.
సినిమా ఆడియో ఫంక్షన్ కు వచ్చిన ఆయన రాజకీయాల మీద ఆయన చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. రజనీకి ప్రజల్లో మంచి ఆదరణ ఉందన్న ఆయన.. విజయ్ కు పంచ్ వేసేలా వ్యాఖ్యలు చేయటం గమనార్హం.
నటుడు విజయ్ తాజాగా మాట్లాడుతూ.. తాను ముఖ్యమంత్రిని అయితే నిజాయితీగా ఉంటాననని.. నటించనని కూడా చెప్పటంపై స్పందించిన కేంద్రమంత్రి అందరూ ఎంజీఆర్.. జయలలితలు కాలేరని వ్యాఖ్యానించటం గమనార్హం. ఇప్పుడు ప్రజల మధ్య ఆరణ ఉన్న నటుడు రజనీకాంత్ మాత్రమేనన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా రెండో స్వాతంత్య్ర పోరాటం చేస్తామని రాహుల్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. వారికి స్వాతంత్య్రం రాదని..ఎప్పుడూ ఊహల్లోనే పోరాటం చేస్తారన్నారు.
తము రజనీకాంత్ ను వెనకేసుకురావటం లేదని.. రాజకీయాల్లోకి ఎవరైనా రావొచ్చన్నారు. నటులు.. పత్రికలు ఇలా అందరూ వివిధ పార్టీల్లో కార్యకర్తలుగా ఉన్నారని చెప్పిన రాధాకృష్ణన్.. విజయ్ లంచం గురించి మాట్లాడుతున్నాడని.. ఏదో ఆరోపణలు చేయాలని కాకుండా లంచగొండులను పట్టిస్తే తానే స్వయంగా ఆయన వద్దకు వెళ్లి పూలమాల వేసి స్వాగతిస్తానని చెప్పారు. రజనీకాంత్‌కు మంచి మనిషి అన్న పేరు ప్రజల్లో ఉన్నట్లు చెప్పారు. విజయ్ కు పంచ్ లు వేస్తూ.. రజనీని ప్రశంసించేలా కేంద్రమంత్రి మాటల వెనుక మర్మం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.