"తెలంగాణలో అధికారమే పరమావధిగా పని చేయాలి. ఇక్కడ ఎలాంటి పొత్తులు ఉండవు. అధికార తెలంగాణ రాష్ర సమితిని గద్గె దించడమే మీ లక్ష్యం కావాలి. ఇందుకోసం అధిష్టానం నుంచి మీకు ఎలాంటి వనరులు కావాలో అడగండి. ఇస్తాం. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారం మాత్రం మనదే కావాలి" ఇది భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రెండు రోజుల క్రితం శంషాబాద్ విమానాశ్రయంలో తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులకు ఇచ్చిన క్లాస్. ఈ క్లాస్ కోసం ఆయన రెండు గంటలు వెచ్చించారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు వెళ్లడం నుంచి... పొత్తులు... ఎత్తులు... ప్రత్యర్ధుల బలాబలాలు వంటి అంశాలను పార్టీ నాయకులతో చర్చించారు. ఇక్కడ అధికారంలోకి రావడమే మన లక్ష్యంగా పని చేయాలని కూడా దిశానిర్దేశం చేశారు.
అంతేనా... అంటే ఇంకా ఉంది. ముందస్తు ఎన్నికల్లో ఎవరు ఎవరితో పొత్తులు పెట్టుకున్నా మనం మాత్రం ఒంటరిగానే పోటీ చేస్తామని - ఎన్నికల తర్వాత మనం కింగ్ లమవుతామని కూడా అన్నారు. "మనమే అధికారంలోకి రావాలి. ఒకవేళ రాలేక పోయినా మనం కింగ్ మేకర్ లుగా అయినా చక్రం తిప్పాలి " అని చెప్పారు. దీంతో తెలంగాణ రాష్ట్ర నాయకులు రెట్టించిన ఉత్సహంతో పని చేయాలని నిర్ణయించుకున్నారు. అంతే కాదు తెలంగాణ రాష్ట్ర సమితి ఘనంగా నిర్వహించామని చెప్పుకుంటున్న ప్రగతి నివేదన సభ తుస్సు మందని కూడా తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులు ఉదరగొట్టారు. ఇదంతా జరిగి రెండు రోజులు కూడా కాలేదు... కేంద్ర మంత్రి ఒకరు మంగళవారం నాటి తన తెలంగాణ పర్యటనలో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని ఆకాశానికి ఎత్తేశారు. అంతే కాదు... వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితే విజయం సాధిస్తుందని కూడా తేల్చేశారు. అలా జోస్యం చెప్పి రాష్ట్ర బిజెపీ నాయకుల పరువు తీసింది ఎవరో కాదు... రాంథాస్ అథవాలే. నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో మంగళవారం పర్యటించిన రాంథాస్ అథవాలే వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడమే కాదు... ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావే తిరిగి ప్రధాని అవుతారని చెప్పారు. దీంతో రాష్ట్ర బిజెపీ నాయకుల గొంతులో పచ్చి వెలక్కాయ పడిపట్లు అయ్యింది. ఒక పక్క ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పని చేయాలని అధ్యక్షుడు చెబుతూంటే కేంద్ర మంత్రులు ఇలా మాట్లాడడం ఏమిటని రాష్ట్ర నాయకులు తలలు పట్టుకుంటున్నారు. ఇది తెలిసినప్పటి నుంచే ఏమి సేతురా అమిత్ షా... ఏమీ పేతూ అని పాటలు పాడుకుంటున్నారట.