ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కన్ను నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనవడిపై పడింది. బెంగాల్ ను అతలాకుతలం చేస్తున్న సమస్య నుంచి బయటపడేందుకు నేతాజీ మనుమడు చంద్రబోస్ సరైన వ్యక్తి అని నిర్ణయించుకున్నారు. డార్జిలింగ్ లో 30 రోజులుగా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రత్యేక గూర్ఖాలాండ్ రాష్ట్ర ఉద్యమం రోజురోజుకూ ఉగ్రరూపం దాలుస్తూ ఉద్యమంలో భాగంగా పలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. రైల్వే రక్షణ దళం కార్యాలయంతోపాటు ఓ పోలీసు కేంద్రానికి - ప్రభుత్వ గ్రంథాలయానికి ఉద్యమకారులు నిప్పుపెట్టినట్లు పోలీసులు తెలిపారు. ఇలా నిరసను ముదురుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంది
డార్జిలింగ్ సంక్షోభం నివారణకు గూర్ఖా జనముక్తి మోర్చా (జీజేఎం) నాయకుడు బిమల్ గురుంగ్ ను చర్చలకు రప్పించే బాధ్యతను కేంద్రప్రభుత్వం నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనుమడు చంద్రబోస్ కు అప్పగించింది. దీనిపై చంద్రబోస్ సైతం సుముఖత వ్యక్తం చేశారు. ``మమతాబెనర్జీ నేతృత్వంలోని బెంగాల్ ప్రభుత్వంతో సంప్రదింపుల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 4న కొద్దిమంది ఇంటలిజెన్స్ అధికారులు మా ఇంటికి వచ్చి బిమల్ గురుంగ్‌ను మళ్లీ చర్చలకు వచ్చేలా చేయాలని కోరారు`` అని చంద్రబోస్ మీడియాకు చెప్పారు. అయితే గురుంగ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో కూడిన త్రైపాక్షిక చర్చలకైతేనే వస్తానని అన్నారని వివరించారు. కాగా, తమ ఆమరణ నిరాహార దీక్షలను రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేసినట్లు గూర్ఖాలాండ్ ఉద్యమ సమన్వయ కమిటీ (జీఎంసీసీ) ప్రకటించింది. ఈ నెల 18న జరిగే అఖిలపక్ష సమావేశంలో తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని జీఎంసీసీ తెలిపింది.