జీవితంలో విజయానికి చాణక్యుడు ఏం చెప్పాడంటే..!

Update: 2021-08-16 07:40 GMT
చాలా మంది ఓటమిని చూసి కుంగిపోతుంటారు. కష్ట పడి పని చేసినప్పటికీ వారు విజయం సాధించలేకపోయి ఫెయిల్ అవుతూనే ఉంటారు. ఈ నేపథ్యంలో అపరచాణక్యుడు సూచించిన ఈ విషయాలను గుర్తుపెట్టుకుంటే చాలు.. ఇట్టే విజయం బాటలో నడువవచ్చట. ఇంతకీ ఆ విషయాలేంటి? లక్ష్యాన్ని చేరుకునేందుకు ఉపయోగపడే చాణక్య నీతి ఎలా ఉంటుంది? కష్టాలను ఎలా అధిగమించాలి? అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ కథనాన్ని పూర్తిగా చదవాల్సిందే.జీవితంలో విజయం సాధించాలనుకునే ప్రతీ ఒక్కరు చాణక్యుడు చూపించిన ఈ మార్గంలో నడిస్తే కచ్చితంగా విజయం వరిస్తుందని పెద్దలు చెప్తున్నారు.

మన జీవితాన్ని సన్మార్గంలో నడిపించే ఆ మార్గ నిర్దేశకాలను కంపల్సరీగా ప్రతీ ఒక్కరు పాటించాలట. చాణక్యుడు బోధించిన ఆ ప్రబోధాలను వంట పట్టించుకోవడం ద్వారా చాలా మంచి జరుగుతుందట. కష్టపడి పని చేయడం ఈ రోజుల్లో కామన్ అయిపోతున్నది. అయితే, కష్టపడి పని చేసినంత మాత్రాన సక్సెస్ రాకపోతే ఏం చేయాలి? అనేది గైడ్ చేసే వారు లేరు. ఈ క్రమంలో అపరచాణక్యుడు చెప్పిన ఈ మాటలు గుర్తు తెచ్చుకోండి. అవేంటంటే..‘కష్టపడి పని చేసినప్పటికీ సక్సెస్ మనకు రాకపోతే వెంటనే వ్యూహం మార్చాలి. వెళ్లే మార్గాన్ని మార్చాల్సిన అవసరం లేదు. కానీ, వ్యూహం మార్చుకుని ముందుకెళ్లాలి. అలా చేయడం ద్వారా సక్సెస్ ఆటోమేటిక్‌గా మీ సొంతమవుతుంది’ అని చాణక్యుడు పేర్కొన్నాడు. ఇందుకు ఉదాహరణ చెట్టు అని చెప్పాడు చాణక్యుడు.

చెట్టు ఎల్లప్పుడు తన లీవ్స్‌ను మారుస్తూ ఉంటుంది. కొద్ది కాలం పాటు చెట్టు ఆకులు పచ్చగా ఉంటాయి. మరి కొంత కాలం ఎండిపోతుంటాయి. ఈ క్రమంలోనే ఆకుల రంగు లేతగా, ముదురుగా కనిపిస్తుంటుంది. ఈ మాదిరిగానే లక్ష్యసాధనకు వ్యూహాలు మార్చాలి. కానీ, మార్గాన్ని కాదని పేర్కొన్నాడు చాణక్యుడు. ఇక చెట్టు ఆకులను మారుస్తూ ఉంటుంది. కానీ, మూలాన్ని మార్చదన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇకపోతే పెద్ద లక్ష్యాన్ని చేరుకునే ముందర మనం చిన్న లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. అలా చేయడం ద్వారా చిన్న లక్ష్యం ఈజీగా రీచ్ అవుతుంది. ఈ క్రమంలోనే ఆటోమేటిక్‌గా పెద్ద లక్ష్యం మన సొంతమవుతుంది.

ఈ క్రమంలోనే నిరాశకు తావు ఇవ్వకుండా వ్యూహాలను మార్చుకుంటూ అంకిత భావంతో కృషి చేస్తూ లక్ష్యం మీ చెంతకు వచ్చి వరిస్తుందట. ఇకపోతే ఓటమి అనేది గెలుపునకు ‘నాంది’ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, ఓటమి, లేదా లక్ష్యసాధనలో విఫలమయినపుడు నిరాశ చెందకుండా వెనుకడగు వేయాలి. కానీ, ఈ క్రమంలోనే వ్యూహాన్ని, వెళ్లిన దారిని సమీక్షించుకోవాలి. ఫలితంగా ఓటమికి గల కారణాలు ఏంటో తెలుసుకోవచ్చు. అలా స్పష్టమైన అవగాహన వచ్చిన తర్వాతనే మళ్లీ ముందుకు సాగాల్సి ఉంటుంది.
 
లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఎత్తుపల్లాల గురించి అస్సలే ఆలోచించొద్దు. పూర్తి అంకిత భావంతో కష్టపడి పని చేయాలి. తద్వారా సక్సెస్ మీ దరి చేరుతుంది. అపర చాణక్యుడు ప్రబోధించిన ఈ సూత్రాలను పాటించిన వారు విజయాలు సాధించినట్లు బోలెడన్నీ ఎగ్జాంపుల్స్ చెప్తుంటారు పెద్దలు. ఈ క్రమంలోనే ప్రతీ ఒక్కరు చాణక్య సూత్రాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. తద్వారా వారి లక్ష్యం అతి తొందరగా రీచ్ అయ్యే చాన్సెస్ ఉంటాయి. లక్ష్యసాధనలో దృఢంగా అడుగులు వేయడం కూడా అతిముఖ్యం.
Tags:    

Similar News