మృతుల కుటుంబాలకు పరిహారం అందించిన చంద్రబాబు.. ఒక్కొక్కరికి ఇన్ని లక్షలు!

Update: 2022-12-29 14:30 GMT
ఏపీలోని నెల్లూరు జిల్లా కందుకూరులో నిర్వహించిన టీడీపీ సభలో తొక్కిసలాట జరిగి 8 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఘటన జరిగిన నాటి నుంచి కందుకూరులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. పార్టీ తరఫున వారి అంత్యక్రియలను నిర్వహించారు. అలాగే మొదట మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించగా ఆ మొత్తాన్ని పెంచారు.

మృతి చెందిన కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం అందించాలని టీడీపీ నిర్ణయించింది. పార్టీ సీనియర్‌ నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్సులో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

ఈ నేపథ్యంలో రూ.15 లక్షలను బాధిత కుటుంబాలకు టీడీపీ అధినేత చంద్రబాబు అందజేశారు. దీంతో పాటు పార్టీకి చెందిన పలువురు నేతలు కూడా వ్యక్తిగతంగా ఆర్థికసాయం ప్రకటించారు. పార్టీ నేతలు ప్రకటించిన రూ.10లక్షలతో కలిపి మొత్తం రూ.25 లక్షల చొప్పున మృతుల కుటుంబాలకు ఇవ్వనున్నారు.

అలాగే తొక్కిసలాటలో మృతి చెందిన కుటుంబాలకు పిల్లలకు ఎన్టీఆర్‌ ట్రస్టు ఆధ్వర్యంలోని స్కూలులో చదువు చెప్పించనున్నారు. ఆ బాధ్యతలను కూడా టీడీపీ తీసుకుంది.
మరో ప్రధాని నరేంద్రమోదీ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనతో తీవ్రంగా కలత చెందినట్లు తెలిపారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ట్వీట్‌ చేసింది.  క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు.  ప్రధానమంత్రి జాతీయ సహాయనిధి) నుంచి మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, గాయపడిన వారికి రూ.50వేల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

కందుకూరులో చంద్రబాబు పాల్గొన్న‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ సభకు కార్యకర్తలు భారీగా తరలిరావడంతో తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం 8 మంది మరణించారు. వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. కార్యకర్తలు భారీగా తరలిరావడంతో తోపులాట జరిగి ఒకరిపై ఒకరు పడటంతో ఈ దుర్ఘటన సంభవించింది. క్షతగాత్రులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.  


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News