మెట్రో హుళక్కే.. బాబుకు కేంద్రం షాక్

Update: 2018-12-21 12:04 GMT
ఏపీ సీఎం చంద్రబాబు కు కేంద్రం మరో షాక్ ఇచ్చింది. ఏపీని దూసుకుపోయేలా అభివృద్ధి చేస్తున్నా అని ప్రకటనలిస్తున్న బాబు జోరుకు ఒక్క ప్రకటన తో బ్రేకులు వేసింది. ఏపీ ప్రభుత్వం అమరావతి లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెట్రో రైలు ప్రాజెక్టు కు సంబంధించిన ప్రతిపాదన ఇంకా తమ కు చేరలేదని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ స్పష్టం చేసింది. దీంతో ప్రభుత్వం అవాక్కైంది.

ఏపీ ప్రభుత్వం 2017లోనే విజయవాడ మెట్రో రైలు కు సంబంధించిన సాధ్యాసాధ్యాలు, అంచనా వ్యయం, రూట్ మ్యాప్ ను కేంద్రానికి పంపినట్టే ఏపీ ప్రభుత్వం చెప్పుకుంది. కానీ తాజాగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయమంత్రి హర్దీప్ సింగ్ పూరి గురువారం రాజ్యసభ లో రాతపూర్వకంగా కేంద్రానికి ప్రతిపాదనేది రాలేదని బాంబు పేల్చారు. దీంతో ఏపీ ప్రభుత్వం ఇరకాటంలో పడింది.

రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ మేరకు కేంద్రానికి ప్రశ్నను సంధించగా కేంద్ర మంత్రి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. మెట్రో రైలు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వ్యవహారామని.. కేంద్రానికి దీంతో సంబంధం లేదని కేంద్రమంత్రి వివరణ ఇవ్వడం ఏపీ ప్రభుత్వానికి చెంపపెట్టులా మారింది.

కాగా ఏపీ ప్రభుత్వం విజయవాడ- అమరావతి లో 26 కిలోమీటర్ల మేర రెండు కారిడార్లలో పెనమలూరు నుంచి బందరు రోడ్డు మీదుగా బస్టాండ్ కు, రెండో కారిడార్ నిడమానూరు- ప్రసాదంపాడు- రామవరప్పాడు- గుణదల- ఏలూరు రోడ్డు- అలంకార్ థియేటర్- రైల్వేస్టేషన్- తుమ్మలపల్లి కళాక్షేత్రం- పోలీస్ కంట్రోల్ రూమ్- ఫైర్ స్టేషన్ మీదుగా బస్టాండ్ వరకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది.

అయితే ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెట్రోరైలు ప్రతిపాదన లేదని కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో మెట్రో విషయం లో ఏపీ ప్రభుత్వం ఏం చేయబోతుందనేది ఆసక్తిగా మారింది.
Tags:    

Similar News