బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ వ్యవహారాల ఇన్ చార్జి అయిన సునీల్ దియోధర్ సంచలన కామెంట్ చేశారు. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబును 'కట్టప్ప' తో పోల్చాడు. కర్నూలు జిల్లాలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశారు. పిల్లనిచ్చిన సొంత మామనే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబును నమ్మేది లేదని.. ఆయనతో భవిష్యత్తులో పొత్తు ఉండదని స్పష్టం చేశారు..
చంద్రబాబుతో భవిష్యత్తులో ఎలాంటి పొత్తు ఉండదని.. బీజేపీ ద్వారాలు ఆయనకు మూసివేశామని సునీల్ దియోధర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధ్యాయం ముగిసిపోయిందని.. దాని శకం త్వరలోనే ముగియబోతోందని స్పష్టం చేశారు.
ప్రధాని మోడీ , బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా కూడా భవిష్యత్తులో ఎప్పుడూ టీడీపీతో బీజేపీ ఎలాంటి పొత్తు ఉండదని స్పష్టం చేశారని సునీల్ దియోధర్ అన్నారు.
ఇటీవల విశాఖపట్నం జరిగిన టీడీపీ పార్టీ సమావేశంలో చంద్రబాబు హాట్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.. బీజేపీతో సంబంధాలు తెంచుకోవడం ద్వారా పెద్ద తప్పుచేశానని తనకు ప్రధాని మోడీతో ఎలాంటి వ్యక్తిగత శతృత్వం లేదని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్ గానే బాబుకు ఇక ద్వారాలు ముగిశాయని సునీల్ దియోధర్ పేర్కొనడం గమనార్హం.
అయితే చంద్రబాబును కట్టప్పతో పోల్చడమే కొందరికీ నచ్చలేదు.దీనిపై సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. బాహుబలి చిత్రంలో కట్టప్ప తన రాజ్యానికి కట్టుబానిస.. నిబద్ధతగల సేనాని.. రాజ్యం కోసం, ప్రజల సంక్షేమం, రాజమాత ఆజ్ఞను తూచా తప్పకుండా పాటించి హీరోను కూడా వెన్నుపోటు పొడుస్తాడు. కానీ చంద్రబాబు మాత్రం కట్టప్ప ఎప్పటికీ కాలేడని.. ఆయన ఏపీ రాజ్యం కోసం ఎప్పుడూ ఆలోచించలేదని.. కేవలం సొంత ప్రయోజనాల కోసమే తాపత్రాయపడ్డారని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. కట్టప్పకు ఉన్న విశ్వాసం చంద్రబాబుకు అస్సలు లేదంటూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు.