తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు - ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన సందర్భంగా అనేక ఆసక్తికరమైన దృశ్యాలు చోటుచేసుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలుసుకునేందుకు పార్లమెంటు వెళ్లిన చంద్రబాబు ఈ సందర్భంగా బీజేపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే శత్రుఝ్న సిన్హాతో కరచాలనం చేశారు. ఈ సందర్భంగా ఆయనతో కాసేపు ముచ్చటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటే ఇంతెత్తున ఎగిరిపడే సిన్హాతో బాబు ముచ్చటించడం ఆసక్తికరంగా మారింది.
మరోవైపు పార్లమెంటులో టీడీపీ ఎంపీలతో బాబు ముచ్చటిస్తున్న సమయంలో, వారితో కలిసి సభ నుంచి బయటకు వస్తున్నపుడు సందడి నెలకొంది. పలు పార్టీల నేతలు వారిని ఆసక్తికరంగా చూస్తుండగా కొందరు నాయకులు పలకరించారు. ఇదిలాఉండగా పార్లమెంటులోనే కేంద్ర సమాచార శాఖా మంత్రి వెంకయ్యనాయుడుతో చంద్రబాబు సమావేశమయ్యారు. అక్కడే రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభుతోనూ భేటీ అయ్యారు. ఇదిలాఉండగా వైసీపీ ఎంపీలు పార్లమెంటులోని గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలని వారు ప్లకార్డులను ప్రదర్శించారు.