ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆ రాష్ట్ర మంత్రులపై నమ్మకం లేదా? కేబినెట్ సహచరులందరినీ బాబు అవమానించారా? అంటే అవుననే సమాధానం రాజకీయ వర్గాల నుంచి వస్తోంది. వెలగపూడిలోని నూతన సచివాలయంలో మంత్రులకు చేదు అనుభవం ఎదురవడాన్ని ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. కేబినెట్ సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్లిన మంత్రులు సమావేశానికి సెల్ ఫోన్లు తీసుకువెళ్లేందుకు నిరాకరించారు.
సమావేశానికి హాజరయ్యేందుకు వెళుతున్న మంత్రుల వద్ద ఉన్న సెల్ ఫోన్లను అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అడిగి తీసుకొని డిపాజిట్ చేసుకున్నారు. ఈ పరిణామంపై ఖంగుతిన్న పలువురు మంత్రులు దేశంలో ఎక్కడా లేని సంస్కృతి ఇక్కడేంటని అసంతృప్తి వ్యక్తం చేశారని అక్కడున్న జర్నలిస్టులు కొందరు వ్యాఖ్యానించారు. మంత్రివర్గ రహస్యాలను కాపాడేందుకే ఇలా చేశారని కొందరు పేర్కొంటుండగా.... మంత్రులపై నిఘా పెట్టిన సీఎం చంద్రబాబు అని మరికొందరు అంటున్నారు. ఏదిఏమైనప్పటికీ ఎక్కడా లేని విధంగా మంత్రుల సెల్ ఫోన్లు సెక్యురిటీ సిబ్బంది తీసుకునేలా ఆదేశాలు రావడంపై పలువురు అమాత్యులు నొచ్చుకున్నారని పేర్కొంటున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/