సీరియస్‌గా సాగుతున్న ఏపీ క్యాబినెట్ మీటింగ్‌లో చంద్రబాబు సెల్ మోగింది. నెంబరు చూసిన బాబు.. వెంటనే సమావేశం నుంచి బయటకు వచ్చేశారు.కాసేపు సీరియస్‌గా మాట్లాడిన ఆయన తర్వాత లోపలికి వచ్చేశారు. ఇంతకీ ఆయనకు వచ్చిన ఫోన్ కాల్ ఎక్కడి నుంచి అంటే.. ప్రధాని మోడీ నుంచి అని చెబుతున్నారు. ప్రధానమంత్రి మోడీనే స్వయంగా ఫోన్ చేయటంపై ఆసక్తి వ్యక్తమవుతున్నా.. ఇదంతా రోటీన్ వ్యవహారంగా చెబుతున్నారు.
వాస్తవానికి క్యాబినెట్ మీటింగ్‌కు కాస్త ముందే చంద్రబాబు.. ప్రధానికి ఫోన్ చేయగా.. అటు వైపు నుంచి ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దీంతో క్యాబినెట్ మీటింగ్‌లో కూర్చున్న చంద్రబాబుకు.. మోడీ నుంచి ఫోన్ కాల్ వచ్చింది.
ఆదివారం రాత్రి జపాన్ పర్యటనకు వెళుతున్న నేపథ్యంలో ఆ విశేషాల్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లటంతో పాటు.. పోలవరం ప్రాజెక్టు శంకుస్థాపనకు ప్రధాని రావాలంటూ పర్సనల్‌గా ఆహ్వానించేందుకు బాబు ఫోన్ చేసినట్లు చెబుతున్నారు. తన ఫోన్ కాల్‌కు రెస్పాండ్ కానీ మోడీ.. తర్వాత చూసుకొని తానే స్వయంగా ఫోన్ చేశారని.. అమరావతి నిర్మాణం.. పోలవరం శంకుస్థాపనకు సంబంధించి సానుకూలంగా స్పందించారని చెబుతున్నారు.