లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్పా....పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాపులర్ డైలాగ్ ఇది. క్లాస్ నుంచి మాస్ వరకు బాగా పాపులర్ అయిన ఈ పంచ్ డైలాగ్ ఇపుడు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు సరిగ్గా సరిపోతుంది! గ్రేటర్ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయం ఈ డైలాగ్ ను వాడుకోవాల్సి వస్తోంది!
ఇంతకీ విషయం ఏంటంటే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ-బీజేపీ తరఫున చంద్రబాబు హైదరాబాద్ లో ప్రచారం చేయనున్నారని తెలుగుదేశం నేతలు ఇప్పటికే ప్రకటించారు. తాజాగా బాబు పర్యటన తేదీలు ఖరారు అయ్యాయి. ఈనెల 28, 29, 30 తేదీల్లో పర్యటించనున్నారు. ఫిబ్రవరీ 2వ తేదీన పోలింగ్ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. అంటే ప్రచారానికి ముగిసే మూడు రోజుల ముందు బాబు సుడిగాలి పర్యటన చేయనున్నారు. అంతకుముందు ఈనెల 12న నిజాం కాలేజీలో జరిగే భారీ బహిరంగసభలో చంద్రబాబు పాల్గొననున్నారు. టీటీడీపీ నేతలతోపాటు మిత్రపక్షమైన బీజేపీ నాయకులు - కేంద్రమంత్రులు సైతం ఈ బహిరంగ సభకు హాజరుకానున్నారు.
నిజాం కాలేజీ బహిరంగ సభ నుంచే టీడీపీ-బీజేపీ ఎన్నికల ప్రచారం షురూ చేయనున్న నేపథ్యంలో ఆరంభం అదిరిపోయేలా ఉండాలని ఇరు పార్టీల నేతలు ప్లాన్ చేస్తున్నారు. నగరానికి తెలుగుదేశం ప్రభుత్వం చేసింది ఏంటి, భవిష్యత్తులో టీడీపీ-బీజేపీల పొత్తుతో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఏం చేయనుంది? అధికార పక్షం వైపల్యాలు ఏంటి తదితరాలు వివరించనున్నారు. ఈ క్రమంలో నగరంలోని 150 మున్సిపల్ డివిజన్లు, వార్డుల నుంచి బహిరంగసభకు జనసమీకరణ చేయాలని టీటీడీపీ నేతలు నిర్ణయించారు.