దేశంలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. తెలుగు రాష్ట్రాలలో ఆ వేడి ఎక్కువగానే ఉంది. ఈ సమయంలో అన్నీ పార్టీలూ అన్ని కులాలను తమ వైపు తిప్పుకుందుకు శత విధాల ప్రయత్నాలు చేస్తున్నాయి. కుల ప్రస్తావన లేకుండా భారతదేశంలో ఎన్నికలను ఉహించడం కష్టమే. ఆయా కులాలకు వరాలు గుప్పించి వారిని తమ వైపు తిప్పుకుని ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా పార్టీలు పనిచేస్తాయి. అయితే తెలుగుదేశం పార్టీ లో మాత్రం పరిస్దితి ఇందుకు భిన్నంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో దాదాపు అన్ని కులాలు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు - ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు దూరమవుతున్నాయి. దూరమవుతున్నాయి అనడం కంటే చంద్రబాబు నాయుడే అన్ని కులాలను దూరం చేసుకుంటున్నారు. ఒక్క ఆయన కులమే తెలుగుదేశం పార్టీకి విధేయతగా ఉన్నట్లు కనిపిస్తోంది. నిశితంగా పరిశీలిస్తే ఆ కులం వారి లోను చంద్రబాబు పైనా - తెలుగుదేశం పార్టీ పైనా అసంతృప్తి పెరుగుతూనే ఉంది.
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే బ్రాహ్మణులు - కాపులు - నాయిబ్రహ్మణులు తెలుగుదేశానికి దూరమయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో సింహ భాగమైన రెడ్డి కులస్తులు తొలి నుంచి తెలుగుదేశానికి - ముఖ‌్యంగా చంద్రబాబు నాయుడుకి దూరంగానే ఉన్నారు. కాపులకు రిజర్వేషన్ విషయంలో చంద్రబాబు నాయుడు అన్యాయం చేసారని ఆ వర్గం వారంతా ఆగ్రహంతో ఉన్నారు. కాపు రిజర్వేషన్ పోరాట సమితి అధినేత ముద్రగడ పద్మనాభం తెలుగుదేశం పార్టీపైన - చంద్రబాబు నాయుడు పైన ఆగ్రహంతో రగిలిపోతున్నారు. వచ్చే ఎన్నికలలో చంద్రబాబు నాయుడుని ఓడించడమే లక్ష్యంగా ఆయన పనిచేస్తున్నారు. కాపు కులస్తులంతా ముద్రగడ వైపే ఉన్నారు. చంద్రబాబు నాయుడు కాపులకోసం ఓ కార్పొరేషన్ ఏర్పాటు చేసినా కాపులందరూ తమకు రిజర్వేషన్ కావాలంటూ బాబును వ్యతిరేకిస్తున్నారు. ఈ విధంగా తెలుగుదేశం పార్టీకి కాపులు దూరమైనట్లే.
ఇక బ్రాహ్మణులైతే చంద్రబాబు నాయుడిపై కారాలు - మిరియాలు నూరుతున్నారు. మాజీ చీఫ్ సెక్రెటరి ఐ.వి.ఆర్. క్రష్ణారావును అవమానించిన తీరుపై బ్రాహ్మణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు పుండు మీద కారం చల్లినట్లుగా తిరుమల తిరుపతి దేవస్దానం ప్రధాన అర్చకులు రమణ దీక్షితులను పదవి నుంచి తొలగించిన తీరును కూడా బ్రాహ్మణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ రెండు ఘటనలతో బ్రాహ్మణులు చంద్రబాబు నాయుడుకు పూర్తిగా దూరమైనట్లే.
తమ డిమాండ్ల పరిష్కరం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసేందుకు వచ్చిన నాయీబ్రాహ్మణులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అవమానించిన తీరుపై ఆ కులంలోనూ ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. " వీరిని ఇక్కడికి ఎవరు రానిచ్చారు. ఏం తమాషాగా ఉందా " అంటూ వేలు చూపిస్తూ నాయీబ్రాహ్మణుల నాయకులను చంద్రబాబు నాయుడు అవమానించిన తీరుపై ఆ కులస్తులు మండిపడుతున్నారు. తెలుగుదేశం పార్టీకి ఈ కులస్తులు కూడా దూరమైనట్లే.
ఇక దళితులలో రిజర్వేషన్ పేరిట ఆరనిచిచ్చు రేపిన చంద్రబాబు నాయుడిపై మాల మాదిగలు కస్సుబుస్సుమంటున్నారు. ఏతావాతా ఆంధ్రప్రదేశ్ లో దాదాపు అన్ని కులాలు తెలుగుదేశం పార్టిపైన - చంద్రబాబు నాయుడి పైన ఆగ్రహంగా ఉన్నాయి. రానున్న ఎన్నికలలో ఈ కులాలవారు చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా పనిచేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. నిజానికి ఇవేవీ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించినవి కాకపోయినా కులాల బలం ఎమోషనల్ గా ప్రజలపై తీవ్రంగా పనిచేసేది అధికారాన్ని శాసించే అసెంబ్లీ ఎన్నికలపైనే!