ఇన్సూరెన్స్ కంపెనీలు త్వరలో షాకింగ్ విషయం వెల్లడించనున్నాయా?
అయితే.. ఇకపై గాలి నాణ్యతను కూడా పరిగణలోకి తీసుకోవాలని ఇన్సూరెన్స్ సంస్థలు భావిస్తున్నాయని రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది.
ఇటీవల కాలంలో.. ప్రధానంగా దేశ రాజధానిలో ఎయిర్ క్వాలిటీ దారుణంగా పడిపోయిన సంగతి తెలిసిందే. గత ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో ఢిల్లీలో గాలి పీలిస్తే... ఒక్క రోజులో 40 కంటే ఎక్కువ సిగరెట్లు కాల్చడంతో సమానం అని.. ముఖ్యంగా పిలలు, వృద్ధులు, శాస్వకోశ, గుండె జబ్బులు ఉన్నవారికి తీవ్ర ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తాయనే కామెంట్లు వినిపించాయి.
నాడు ఈ పరిస్థితులపై స్పందించిన అశోకా యూనివర్సిటీలోని బయోసైన్సెస్ అండ్ హెల్త్ రీసెర్చ్ డీన్ అనురాగ్ అగర్వాల్.. ప్రాణాంతకమైన పొగమంచు ఢిల్లీలోని ప్రతీ పౌరుడి ఊపిరితుత్తులకు హాని కలిగిస్తున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో.. ఇకపై వాయు నాణ్యతను కూడా పరిగణలోకి తీసుకోవాలని ఇన్సూరెన్స్ సంస్థలు భావిస్తున్నాయని తెలుస్తోంది!
అవును... సాధారణంగా హెల్త్ ఇన్సూరెన్స్ జారీ చేసేటప్పుడు వయసుతో పాటు బరువు, వ్యాధులు, అలవాట్లు మొదలైన విషయాలను ఆయా బీమా సంస్థలు పరిగణలోకి తీసుకుంటాయనే సంగతి తెలిసిందే. అయితే.. ఇకపై గాలి నాణ్యతను కూడా పరిగణలోకి తీసుకోవాలని ఇన్సూరెన్స్ సంస్థలు భావిస్తున్నాయని రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది.
ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో వాయు నాణ్యత అంతంతమాత్రంగానే ఉంటున్న వేళ.. ఇక శీతాకాలం సీజన్ వచ్చిందటే దాని పరిస్థితి అత్యంత ఘోరంగా మారిపోతున్న నేపథ్యంలో.. ఇన్సూరెన్స్ కంపెనీలు ఇలాంటి ఆలోచన చేస్తున్నాయనే విషయం ఇప్పుడు వైరల్ గా మారింది. ఇదే జరిగితే ఇకపై హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఢిల్లీ వాసులకు పెరగనుందని అంటున్నారు.
ప్రస్తుతం ఈ అంశంపై వివిధ ఇన్సూరెన్స్ కంపెనీలు చర్చిస్తున్నాయని అంటున్నారు. అనంతరం ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్ మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐ.ఆర్.డీ.ఏ.ఐ) అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అదే జరిగితే.. వాయు నాణ్యత పరిగణలోకి తీసుకుని హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం నిర్ణయించడం ఇదే తొలిసారి కానుంది.
కాగా... ఇటీవల ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ దారుణంగా పడిపోవడంతో చాలా మంది ఆస్పత్రిలో చేరినవారి సంఖ్య పెరిగిందని అంటున్నారు. దీనికోసం హెల్త్ ఇన్సూరెన్స్ వినియోగించుకుంటున్న వారి సంఖ్య 2023 ఫైనాన్షియల్ ఇయర్ తో పోలిస్తే 2025లో 8 శాతం మేర పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే ఆయా ఇన్సూరెన్స్ కంపెనీలు వాయు నాణ్యతను కూడా పరిగణలోకి తీసుకోవాలనే ఆలోచన చేస్తున్నాయని అంటున్నారు. మరి దీనికి.. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్ మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అనుమతి ఇస్తుందా.. లేదా అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.